AP: వైఎస్ జగన్ లేఖపై కమిటీ నిజానిజాలు తేలుస్తుంది

ఏ విషయమైనా సాంతంగా పరిశీలిస్తేనే అందులో తప్పొప్పులనేవి అర్ధమౌతాయి. అదే జరుగుతోంది ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్..ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకు రాసిన లేఖ విషయంలో. మొదట్లో విమర్శలు వచ్చినా..ఇప్పుడందరూ జగన్ లేఖను సమర్ధిస్తున్నారు.

Last Updated : Oct 18, 2020, 10:46 PM IST
  • ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు సీజేకు రాసిన లేఖపై స్పందించిన విశ్రాంత న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ
  • జగన్ లేఖపై కమిటీ ఏర్పడుతుంది. కమిటీనే నిజానిజాలు తేలుస్తుంది
  • ఇంట్లో తప్పు జరిగితే ఫిర్యాదు చేసేది ఇంటి పెద్దకే కదా..
AP: వైఎస్ జగన్ లేఖపై కమిటీ నిజానిజాలు తేలుస్తుంది

ఏ విషయమైనా సాంతంగా పరిశీలిస్తేనే అందులో తప్పొప్పులనేవి అర్ధమౌతాయి. అదే జరుగుతోంది ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్..ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ( Chief justice S A Bobde ) కు రాసిన లేఖ విషయంలో. మొదట్లో విమర్శలు వచ్చినా..ఇప్పుడందరూ జగన్ లేఖను సమర్ధిస్తున్నారు.

ఏపీ హైకోర్టు ( Ap High court ) ను ప్రభావితం చేస్తున్నారంటూ జస్టిస్ ఎన్వీ రమణ ( Justice N V Ramana )పై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకు ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ( Ap cm ys jagan letter ) రాసిన లేఖ సంచలనమైంది. కొందరు దీన్ని సమర్ధించగా మరి కొందరు విమర్శించారు. ఇప్పుడిదే అంశంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , అలహాబాద్ హైకోర్టుల మాజీ న్యాయమూర్తి  డీఎస్ఆర్ వర్మ ( Retd judge justice DSR Varma ) స్పందించారు. ఇంట్లో తప్పు జరిగినప్పుడు ఇంటి పెద్దకు కాకుండా మరెవరికి ఫిర్యాదు చేస్తామని ప్రశ్నించారు. న్యాయమూర్తులు చట్టానికి అతీతులు కాదని..ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారమనడం గొంతు నులమడమేనని డీఎస్ఆర్ వర్మ స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టుపై ఓ వ్యక్తికున్న పట్టు గురిచి విదేశీ పరిశోధకులే చెప్పిన సందర్భాలున్నాయన్నారు. ఇదే విషయాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆదారాలతో బయటపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయకూడదని ఎక్కడా లేదని రిటైర్డ్ న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా, అభ్యంతరం ఉన్నా చివరకు వెళ్లేది న్యాయవ్యవస్థ వద్దకేనన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖ వ్యక్తిగతం కాదని..ప్రభుత్వం తరపున రాసిన లేఖగా ఆయన స్పష్టం చేశారు.  Also read: Visakha land scam: మళ్లీ ప్రారంభమైన సిట్ దర్యాప్తు

ఇక ఆ లేఖను బహిర్గతం చేయడం సరైనదా కాదా అనే విషయం చర్చనీయాంశమన్నారు. ఈ అంశంలో మంచి చెడుల్ని ప్రజల విజ్ఞతకే వదిలేయాలన్నారు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ( Justice Chalameshwar ), రంజన్ గగోయ్, జోసెఫ్ లు మీడియా ముందుకొచ్చి మరీ..ప్రదాన న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయడాన్ని దేశమంతా చూసిందని గుర్తు చేశారు. 

ముఖ్యమంత్రి రాసిన లేఖపై సుప్రీంకోర్టు సీజే అంతర్గత విచారణ జరుపుతారన్నారు. దీనికోసం ఓ కమిటీ ఏర్పడుతుందని..ఆ కమిటీనే నిజానిజాలు తేలుస్తుందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలనేవి ఉంటాయన్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు తప్పు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదే చేయకూడదంటే ఎలా అని అడిగారు. తమపై ఫిర్యాదే చేయరాదని చెప్పడానికి న్యాయమూర్తులేమైనా చట్టాలకు అతీతులా అని ప్రశ్నించారు.  నిరాధార ఆరోపణలు చేయకూడదన్న సంగతి మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలని..ఆధారాలున్నప్పుడు కూడా ఫిర్యాదు చేయకూడదంటే ఎలా అని అన్నారు. 

ఆ న్యాయమూర్తిపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవన్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా, అభద్రతా భావం కలిగించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించరాదన్నారు. వ్యవస్థలను అభద్రతా భావంలోకి నెట్టడం న్యాయవ్యవస్థ పని కాదని.. అలా అభద్రతా భావం కలిగించినప్పుడు, బాధతోనే ముఖ్యమంత్రి స్పందించారని జస్టిస్ డీఎస్ఆర్ వర్మ తెలిపారు. 

అమరావతి భూముల కుంభకోణం ( Amaravati lands scam ) విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ( Ap high court's GAG order ) మాత్రం చాలా తప్పని చెప్పారు జస్టిస్ వర్మ. సుప్రీంకోర్టు తీర్పులకు అది విరుద్ధమని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుందని..ఆపడానికి వీల్లేదన్నారు. Also read: Debate on Judiciary: జగన్ లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాల్సిందే: ఉండవల్లి

Trending News