4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా నాల్గో దశలో ఎలక్షన్ పోలింగ్ జరిగేది ఈ లోక్ సభ సీట్లలోనే.. !

4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు నాల్గో విడతలో భాగంగా 9 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 96 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఏయే లోక్‌సభ సీట్లకు   పోలింగ్ జరుగుతుందంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : May 12, 2024, 09:31 PM IST
4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా నాల్గో దశలో ఎలక్షన్ పోలింగ్ జరిగేది  ఈ లోక్ సభ సీట్లలోనే.. !

4th Phase Lok Sabha Polls 2024 : భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎన్నికల క్రతువు అంటే మాములు మాటలు కావు. ఎత్తైన ప్రదేశాలతో పాటు లోతైన లోయలు.. ఎడారి.. మంచు ప్రదేశాల్లో ఎన్నికలు నిర్వహించడం అంటే కత్తి మీద సామే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 18వ లోక్ ఏడు దశల్లో ఎలక్షన్స్  జరగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి. తాజాగా నాల్గో దశ పోలింగ్ జరగుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 19న తొలి విడతలో 102 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు దశలో 88 స్థానాలు.. మూడో దశలో 92 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. నాల్గో దశలో భాగంగా.. 99 స్థానాలకు  నేడు పోలింగ్ జరుగుతోంది. జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాలతో  దేశ ప్రధానిగా ఎవరు ఉంటారనేది దేశ ప్రజలు డిసైడ్ చేస్తారు.  
 
తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
ఆదిలాబాద్
పెద్దపల్లి
కరీంనగర్
నిజామాబాద్
జహీరాబాద్
మెదక్
మల్కాజ్‌గిరి
సికింద్రాబాద్
హైదరాబాద్
చేవెళ్ల
మహబూబ్ నగర్
నాగర్ కర్నూలు
నల్గొండ
భువనగిరి
వరంగల్
మహబూబా బాద్
ఖమ్మం

ఆంధ్ర ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..

అరకు
శ్రీకాకుళం
విజయ నగరం
విశాఖ పట్నం
అనకాపల్లి
కాకినాడ
అమలాపురం
రాజమండ్రి
నర్సాపురం
ఏలూరు
మచిలీపట్నం
విజయవాడ
గుంటూరు
నర్సారావు పేట
బాపట్ల
ఒంగోలు
నంద్యాల
కర్నూలు
అనంతపూర్
హిందూ పూర్
కడప
నెల్లూరు
తిరుపతి
రాజంపేట
చిత్తూరు

---
బిహార్‌లోని 5 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..

దర్భంగా
ఉజియార్ పూర్
సమస్తిపూర్
బెగుసరాయ్
ముంగేర్

----
మధ్య ప్రదేశ్‌ 8 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
దేవాస్
ఉజ్జయిని
మందసౌర్
రత్లామ్
ధార్
ఇండోర్
ఖర్గోనే
ఖండ్వా

మహారాష్ట్రలోని 11 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..

నందూర్బర్
జల్‌గావ్
రవేర్
జల్నా
ఔరంగాబాద్
మవాల్
పూనే
శిరూర్
అహ్మద్‌నగర్
శిరిడి
బీడ్  

--
ఒడిషాలోని 4 లోక్‌సభ సీట్ల విషయానికొస్తే..
కలహండి
నబరంగ్ పూర్
బెర్హామ్ పూర్
కోరాపూట్

ఉత్తర ప్రదేశ్ లోని 13 లోక్ సభ స్థానాల విషయానికొస్తే..
షాజహాన్ పూర్
ఖేరి
దౌరాహా
సీతాపూర్
హర్దోయి
మిస్రిక్
ఉన్నావ్
ఫరూకాబాద్
ఎటావా
కన్నౌజ్
కన్పూర్
అక్బర్ పూర్
బహ్రెరెచ్

పశ్చిమ బంగాల్ లోని 8 లోక్ సభ స్థానాల విషయానికొస్తే..
బహరామ్ పూర్
కృష్ణానగర్
రానాఘాట్
బర్దమాన్ పుర్బా
బర్ధమాన్ దుర్గాపూర్
అసన్‌సోల్
బోల్‌పూర్
బీర్‌బమ్

ఝార్ఖండ్ లోని 4 లోక్ సభ సీట్ల విషయానికొస్తే..

సింగ్‌భమ్
కుంతీ
లోహర్‌దగా
పాలమావ్

మొత్తంగా 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.మొత్తంగా నాల్గు విడతలకు కలిపి మొత్తంగా 379 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో మూడు విడతల్లో 164 ఎంపీ సీట్లకు మరో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Also read: Voter Slip: ఓటరు స్లిప్ అందకున్నా నో ప్రాబ్లెమ్, ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News