AP Covid Update: ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?

AP Corona Cases: ఏపీలో నిన్నటితో పోలిస్తే కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 06:18 PM IST
  • ఏపీలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు
  • కొత్తగా 4,108 మందికి పాజిటివ్
  • విశాఖ, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా కేసులు
AP Covid Update: ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టాయి.  గడచిన 24 గంటల్లో 22,882 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 4,108 మంది పాజిటివ్ (Corona Cases in AP) గా నిర్ధారణం అయింది. 

 కొత్తగా కొవిడ్ కారణంగా ఎవరూ మరణించకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14510గా (Corona Deaths in AP) ఉంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా బారి నుంచి నిన్న 696 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,182 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా విశాఖ, చిత్తూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. 

Also Read: Viral news: గోదారోళ్లా.. మజాకా..! అల్లుళ్లకు 365 రకాల వంటలతో విందు భోజనం!

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజే.. 2,58,089 లక్షల కేసులు (Corona cases in India) నమోదయ్యాయి. వైరస్​తో మరో 385 మంది మరణించారు. 1,51,740 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News