AP Inter Results 2023: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. చెక్ చేసుకోండి ఇలా..

AP Inter Results 2023: ఏపీ ఇంటర్‌ ఫలితాలు బుధవారం( ఏప్రిల్ 26) విడుదల కానున్నాయి.  రేపు సాయంత్రం 5 గంటలకు రిజల్ట్ ను వెల్లడించనున్నారు మంత్రి బొత్స.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 07:58 PM IST
AP Inter Results 2023: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. చెక్ చేసుకోండి ఇలా..

AP Inter Results 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు రిలీజ్ కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్, 16న సెకండియర్ పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 04తో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు మెుత్తం 10,03,990 మంది హాజరయ్యారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను 4.84 లక్షల మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 5.19 లక్షల మంది రాశారు. ఈ ఎగ్జామ్స్ నిర్వహణకు 1,489 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేవలం 22 రోజుల వ్యవధిలోనే రిజల్ట్ అనౌన్స్ చేయనుంది ఇంటర్ బోర్డు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను bie.ap.gov.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి. 

జేఈఈ మెయిన్‌ ఫైనల్‌ కీ విడుదల
మరోవైపు జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షకు సంబంధించిన ఫైనల్‌ కీ ని జాతీయ పరీక్షల సంస్థ (NTA) తాజాగా రిలీజ్ చేసింది. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేసిన ఎన్‌టీఏ దానిపై అభ్యంతరాలను ఏప్రిల్ 21 వరకు  స్వీకరించింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తుది కీని వెబ్‌సైట్‌లో పెట్టింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను దాదాపు 9 లక్షల మంది రాశారు. గత జనవరి, తాజా పరీక్షల్లో వచ్చిన స్కోర్‌లో ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ర్యాంకులు కేటాయిస్తారు. నెల్లూరు కుర్రాడు పి.లోహిత్‌ ఆదిత్యసాయి 300కి 300 మార్కులు సాధించడం విశేషం. 

Also Read: TTD Fake Websites: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఆ వెబ్‌సైట్‌ను నమ్మొద్దు.. ఇలా గుర్తించండి 

Also Read: Weather Report: తస్మాత్ జాగ్రత్త.. గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న పిడుగుల ప్రమాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News