1998 DSC JOBS: ఆరుగురు సీఎంలు చేతులెత్తేశారు.. సీఎం జగన్ చేసి చూపించారు?

1998 DSC Students: మాట తప్పం.. మడమ తిప్పం.. ఇది వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నినాదం. అన్నట్లుగానే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Written by - Srisailam | Last Updated : Jun 22, 2022, 03:04 PM IST
  • సీఎం జగన్ ను కలిసిన 1998 డీఎస్సీ అభ్యర్థులు
  • ఉద్యోగాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు
  • మాట ఇస్తే తప్పని నేత సీఎం- కల్పలత
1998 DSC JOBS: ఆరుగురు సీఎంలు చేతులెత్తేశారు.. సీఎం జగన్ చేసి చూపించారు?

1998 DSC Students: మాట తప్పం.. మడమ తిప్పం.. ఇది వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నినాదం. అన్నట్లుగానే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా సీఎం జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఏపీలో చర్చగా మారింది. సీఎం జగన్ కు జనాల్లో పాజిటివ్ టాక్ తీసుకొచ్చింది. ఉద్యోగ పరీక్షలో పాసే పోస్టింగ్ కోసం 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు వరమిచ్చారు సీఎం జగన్.  1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించిన సీఎం జగన్ పై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

23 ఏళ్ల సమస్యను పరిష్కరించి తమకు ఉద్యోగాలు ఇచ్చిన సీఎం జగన్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు 1998 డీఎస్సీ అభ్యర్దులు. ఎమ్మెల్సీ కల్పలత రెడ్డితో కలిసి అభ్యర్థులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనైన అభ్యర్థులు జగన్ ను ఆకాశానికెత్తారు. గత ప్రభుత్వాలు తమను బిక్షం ఎత్తుకునెట్లు చేశాయని విమర్శించారు.తమకు  ప్రాణబిక్ష పెట్టిన ముఖ్యమంత్రికి అండగా ఉంటామన్నారు. చరిత్రలో ఎంతో మంది వస్తుంటారు.. కానీ ధైర్యంగా నిర్ణయం తీసుకునే వారే నిజమైన నాయకుడని అన్నారు. అలాంటి లీడరే జగన్ అని కొనియాడారు. టీడీపీ హయాంలో చెప్పులరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదన్నారు డీఎస్సీ అభ్యర్థులు. జగన్ వచ్చి తమకు న్యాయం చేశారని చెప్పారు.ఏడుగురు సీఎంలు మారినా సమస్య పరిష్కారం కాలేదని.. ధమ్మున్న లీడర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. తమకు న్యాయం చేసిన సీఎం వైఎస్ జగన్ చల్లగా ఉండాలని దీవించారు 1998 డీఎస్సీ అభ్యర్థులు.

మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినా న్యాయం జరగలేదన్నారు. ధైర్యంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఒక్క వైఎస్ జగన్ మాత్రమే అన్నారు.  1998 డీఎస్సీ అభ్యర్థుల కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. 98 డీఎస్సీ అభ్యర్థులు సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారన్నారు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి.  

Read also: Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్‌..సీఎం ఠాక్రేకు పాజిటివ్..ఏం జరగబోతోంది..!

Also read:Rain Alert: వేగం పుంజుకున్న నైరుతి గాలులు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News