AP corona updates: ఏపీలో కరోనా విజృంభణ... రెట్టింపయిన కేసులు.. కొత్తగా 1,831 మందికి పాజిటివ్!

Ap corona cases: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్నటి పోలిస్తే కేసులు రెట్టింపయ్యాయి. కొత్తగా 1,831 కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 06:39 PM IST
  • ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
  • కొత్తగా 1,831 మందికి వైరస్ నిర్ధారణ
  • రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ వాయిదా
AP corona updates: ఏపీలో కరోనా విజృంభణ... రెట్టింపయిన కేసులు.. కొత్తగా 1,831 మందికి పాజిటివ్!

Corona Cases in AP : ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో 36,452 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 1,831 కరోనా కేసులు (Corona Cases in AP) నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కొవిడ్ కేసులు రెట్టింపు అయ్యాయి. వైరస్ నుంచి 242 మంది కోలుకున్నారు. కొవిడ్ వల్ల ఎవరూ మృతి చెందలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 యాక్టివ్‌ కేసులు (Active Cases in AP) ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గత కొద్దిరోజులుగా ఐదారు జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. 

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 467, విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరు జిల్లాలో 164, అనంతపురం జిల్లాలో 161, తూర్పు గోదావరిలో 84, కడప జిల్లాలో 20, నెల్లూరులో 129, శ్రీకాకుళం జిల్లాలో 122, విజయనగరంలో 40, పశ్చిమగోదావరిలో 57, ప్రకాశం జిల్లాలో 46, కర్నూలు జిల్లాలో 56 కరోనా కేసులు బయటపడ్డాయి. 

Also Read: AP Night Curfew: ఏపీలో ఇవాళ్టి నుంచి నైట్‌ కర్ఫ్యూ, విద్యాలయాల మూసివేతపై..

నైట్ కర్ఫ్యూ వాయిదా... 18 నుండి అమలు
ఒమిక్రాన్‌ నేపథ్యంలో...రాష్ట్రంలో నేటి నుంచి తలపెట్టిన రాత్రి కర్ఫ్యూ (Night Curfew in ap) వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ వేళ పల్లెలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని.. వారికి ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించకపోతే రూ. 100 ఫైన్ వేస్తామని ప్రకటించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News