World's First Death From H3N8 Bird Flu Virus: యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనావైరస్‌కి పుట్టిన ఇల్లుగా ప్రపంచం ఎదుట దోషిగా నిలబడిన చైనాలో తాజాగా మరో అరుదైన వైరస్‌తో తొలి మరణం చోటుచేసుకుంది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ సౌత్ ప్రావిన్స్‌లో H3N8 బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన 56 ఏళ్ల మహిళ అదే వైరస్‌తో బాధపడుతూ మృతి చెందింది. ఆ మహిళకు H3N8 బర్ల్ ఫ్లూ వైరస్‌లో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా అనే రకం వైరస్ సోకినట్టు తేలింది. ఈ తరహా వైరస్ సోకి మృతి చెందిన తొలి వ్యక్తిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
చైనాలో H3N8 బర్ల్ ఫ్లూ వైరస్‌లో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా సోకిన వారిలో ఈ మహిళ మూడో వ్యక్తి. ఈమెకు వైరస్ సోకడానికి ముందే, గతేడాదే మరో ఇద్దరిలో ఈ వైరస్ గుర్తించారు. ఈ వైరస్ సోకిన మూడు కేసులు కూడా చైనాలోనే నమోదవడం గమనార్హం. H3N8 బర్ల్ ఫ్లూ వైరస్‌లో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజాతో చనిపోయిన మహిళకు గత నెల ఆఖరిలో ఆ వైరస్ సోకినట్టు గ్వాంగ్ డాంగ్ ప్రావిన్షియల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ గుర్తించింది. అయితే, తాజాగా ఆ మహిళ మరణంపై మాత్రం సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
H3N8 బర్ల్ ఫ్లూ వైరస్‌లో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజాతో చనిపోయిన మహిళ గతంలో కోళ్లఫారం పరిశ్రమలో పనిచేసిందని.. అంతేకాకుండా పలు ఇతర అనారోగ్య సమస్యలతోనూ బాధపడినట్టుగా పేషెంట్ హిస్టరీ చెబుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఇది కూడా చదవండి : Mysterious Disease: కరోనా కంటే డేంజర్ వైరస్.. 24 గంటల్లోనే ముక్కు నుంచి రక్తం కారుతూ ముగ్గురు మృతి
చైనాలో జనానికి బర్డ్ ఫ్లూ వైరస్‌తో సంక్రమించే ఇన్‌ఫెక్షన్స్ సోకడం సర్వసాధారణమే అయినప్పటికీ.. అదృష్టవశాత్తుగా ఇందులో ఉన్న పాజిటివ్ అంశం ఏంటంటే.. ఇది మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే రకం వైరస్ కాదు. ఈ అంశమే H3N8 బర్ల్ ఫ్లూ వైరస్‌లో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ని మిగతా వైరస్‌ల నుంచి వేరు చేస్తుంది.
ఇది కూడా చదవండి : Weight loss tips: డైట్‌లో ఈ ఆకులుంటే చాలు..నెలరోజుల్లో స్థూలకాయానికి చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK