పాక్ ప్రభుత్వంతో ఆ దేశ ఆర్మీ సంబధాలు తెంచుకుందా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తుంది. ఓ వైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి మంత్రాలు పఠిస్తున్నారు . మరో వైపు పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఒకే డైరెక్షన్ నడవాల్సింది పోయి భిన్న వైఖరి ప్రదర్శిస్తున్న పాక్ కన్ఫూజ్ స్టేడ్ పై స్పెషల్ స్టోరీ...
ఇండో పాక్ సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిణామాలపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. పుల్వామా దాడి విషయంలో భారత్ కు సానుభూతి ప్రకటించారు...ఉగ్రవాద స్థావరాల విషయంలో ఆధారాలు ఉంటే ఇవ్వాలని చెబుతన్నారు.యుద్ధం జరిగితే ఇరుదేశాలకు నష్టమని వేదాలు వల్లుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధం వద్దు బాబోయ్ అంటూ భారత్ మందు ప్రాధేయపడుతూ కాళ్ల బేరానికి వస్తున్నారు
మరోవైపు యాన్టీ టెర్రర్ ఆపరేషన్ చేస్తున్న భారత్ కు సహకరిచాల్సింది పోయి.. తన కవ్వింపు పాక్ ఆర్మీ మరింత రెచ్చగొడుతోంది. మరోవైపు యుద్ధ సన్నహాల్లో లీనమైంది. భారత భూగంలో ప్రవేశించే సాహనం చేస్తోంది. యుద్ధ విమానాల భారత భూభాగంలోకి తీసుకొచ్చి యుద్ధానికి ప్రేరేపిస్తోంది.
తాజా పరిణామాలు పాక్ ప్రభుత్వం.. ఆ దేశ ఆర్మీకి విభిన్న రీతిలో వెళ్లున్న విషయం స్పష్టమౌతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి .. ఆర్మీ మధ్య సంబంధాలు తెగిపోయాననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో ప్రభుత్వ ఆదేశాలతనే భేఖాతరు చేస్తూ పాక్ ఆర్మీ అనురించిన వైఖరిని ఎత్తిచూపుతూ తమ వాదనను సమర్ధించుకుంటున్నారు.
ప్రపపంచం దృష్ఠి లో శాంతి కోరుకుంటునే భావన కల్గించి భారత్ ను దోషిగా చూపించే పాక్ ఎత్తుగడగా అని కొందరు భావిస్తుంటే.. పాక్ ఆర్మీ ప్రభుత్వం చెప్పుచేతల్లో లేదనే విషయం బహిర్గతమైందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమనే విషయం పక్కన పెడితే భారత్ తో పెట్టుకుంటే ఆ దేశానికి పుట్టగతుండవని మేధావులు హెచ్చరిస్తున్నారు