Delta Variant: కరోనా మహమ్మారి కొత్త సవాళ్లు విసురుతోంది. రానున్న రోజుల్లో డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైన వేరియంట్లు రానున్నాయనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్లపై నిఘా పెట్టింది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) తీవ్రతకు కారణమైన డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకర వేరియంట్లు రానున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఈ విషయంపైనే దృష్టి సారించింది. డెల్టా వేరియంట్ తగ్గే సమయానికి ఇతర వేరియంట్లైన ల్యాంబ్డా, ఈటా వంటివి ప్రమాదకరంగా మారనున్నాయని డబ్ల్యూహెచ్‌వో (WHO)హెచ్చరిస్తోంది. ఏ విధమైన వ్యాక్సిన్‌కు ప్రభావితం కాకుండా ప్రజల్ని అనారోగ్యం పాలుచేసే వేరియంట్ సిద్ధమౌతోందనే విషయం పూర్తిగా తప్పని చెప్పలేమని న్యూస్ వీక్ తాజా నివేదిక చెబుతోంది. అటువంటి వేరియంట్ ఎదురైతే ప్రస్తుత ముప్పు కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రమాదం ఉండవచ్చని అంచనా.
ప్రతి మ్యూటేషన్‌తో ప్రమాదం ఉండకపోవచ్చని..కొత్త వేరియంట్(New variant) సంక్రమణ వేగంపై ఆధారపడి ఉంటుందని న్యూస్ వీక్ తాజా పరిశోధన స్పష్టం చేసింది. ఏడాది పాటు ఒక వేరియంట్ కొద్దిమంది జనాభాలో వ్యాప్తి చెందుతుంటే వచ్చే ప్రమాదం కంటే కోట్లాది మందిలో సోకిన వేరియంట్ ఎక్కువ ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. అసలు మనిషి శరీరమే వివిధ రకాల వేరియంట్లకు ల్యాబ్‌గా పనిచేస్తుంది. వ్యాక్సిన్ తీసుకోని జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంక్రమించే వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారనుంది. మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటించడంతోనే కొత్త వేరియంట్లను ఆపలేమని..వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారమని అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే డెల్టా(Delta Variant) కంటే ప్రమాదకరమైన వేరియంట్ రావచ్చని హెచ్చరిస్తున్నారు.
Also read: రెండే ఆకులు...కానీ బతికేది మాత్రం రెండు వేల సంవత్సరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook