PM Modi Ukraine Visit: ఉక్రెయిన్‌కు భీష్మ క్యూబ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ...దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

PM Modi Gift to Ukraine:  ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు బహుకరించిన భీష్మ  BHISHM (భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా & మైత్రి) క్యూబ్‌లను అందించాడు. విపత్తు నిర్వహణ ,అత్యవసర వైద్య ప్రతిస్పందన కోసం రూపొందించిన అత్యాధునిక మొబైల్ హాస్పిటల్. 

Written by - Renuka Godugu | Last Updated : Aug 24, 2024, 07:44 AM IST
PM Modi Ukraine Visit: ఉక్రెయిన్‌కు భీష్మ క్యూబ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ...దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

PM Modi Gift to Ukraine: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటగా పొలాండ్‌ సందర్శించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అంతేకాదు ఈయన రైల్‌ ఫోర్స్‌ ప్రయాణించారు. అయితే, మోదీ ఉక్రెయిన్‌కు ఓ భారీ బహుమతిని ఇచ్చారు. అదే 'భీష్మ క్యూబ్‌' దీనికి ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?

ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు బహుకరించిన భీష్మ  BHISHM (Bharat Health Initiative For Sahyogihita and Maitri) క్యూబ్‌లను అందించాడు. విపత్తు నిర్వహణ ,అత్యవసర వైద్య ప్రతిస్పందన కోసం రూపొందించిన అత్యాధునిక మొబైల్ హాస్పిటల్. రెండు రోజుల పోలాండ్ పర్యటన అనంతరం ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తెలిసిందే. ఎలాంటి సమయంలో అయినా ప్రజలకు అత్యవసర చికిత్స అందించడానికి భీష్మా క్యూబ్‌ ఉపయోగపడుతుందని మోదీ దీన్ని బహుమతిగా ఇచ్చారు.

అయితే, ఈ భీష్మా క్యూబ్‌ ప్రత్యేకత ఏంటంటే విపత్తు నిర్వహణ అవును, ముఖ్యంగా ఉక్రెయిన్‌కు అత్యవసర వైద్య ప్రతిస్పందన కోసం రూపొందించిన అత్యాధునిక మొబైల్ ఆసుపత్రిని మోదీ తన పర్యటనలో భాగంగా ఉక్రెయిన్‌కు దీన్ని బహుమతిగా ప్రకటించారు. ముఖ్యంగా సహకారం, పరస్పర ప్రయోజనం,మైత్రి కోసం ఇండియా హెల్త్ ఇనిషియేటివ్ 'ప్రాజెక్ట్ భీష్మ' కింద అభివృద్ధి చేసిన అత్యాధునిక మొబైల్ హాస్పిటల్ యూనిట్ ఇది. ముఖ్యంగా అత్యవసర సమయంలో విపత్తు ప్రాంతాల్లో వేగంగా వైద్య సేవలను అందించేందుకు భీష్మా ను 2022 ఫిబ్రవరిలో ప్రకటించారు. 

ఇదీ చదవండి: ఈ జపనీస్‌ బామ్మకు 116 ఏళ్లు.. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ఆమె లైఫ్‌స్టైల్‌ ఎలా ఉండేదో తెలుసా?

భిష్మ క్యూబ్ ప్రత్యేకత ఏంటంటే..?
ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు బహుకరించిన భీష్మ క్యూబ్ అనేది ఒక అద్భుతం. ఆధునిక వైద్య ఇంజనీరింగ్‌కు ఓ నిదర్శనం. ఒకేసారి 200 మందికి సత్వర స్పందన, సమగ్ర సంరక్షణపై దృష్టి సారించేలా రూపొందించారు. ఈ భీష్మా క్యూబ్‌ బరువు దాదాపు 720 కిలోలు. ముఖ్యంగా ఇందులో 72 ఉపకరణాలు ఉన్నాయి. అంటే ఎలాంటి విపత్తు ఉన్న ప్రదేశాలకు కూడా దీన్ని సులభంగా సులభంగా రవాణా చేయవచ్చు. దీని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఉపకరణాలను సింపుల్‌గా చేతుల మీద లేదా సైకిల్ లేదా డ్రోన్ ద్వారా కూడా తీసుకువెళ్లే విధంగా దీన్ని తయారు చేశారు. భిష్మా క్యూబ్‌ను ఎలాంటి విపత్కర ప్రదేశాల్లో అయినా సింపుల్‌గా ఎక్కడైనా సులభంగా అమర్చవచ్చు. 

 

 

ఇదీ చదవండి:  ఘోర విషాదం.. నదిలో పడిపోయిన బస్సు 14 మంది భారతీయుల మృతి!

భారత ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఉక్రెయిన్‌ పర్యటనలో భాగంగా నిన్న కైవ్‌లో ఉక్రెయిన్ ప్రభుత్వానికి నాలుగు భిష్మ క్యూబ్‌లను అందించాడు. ఈ బహుమతికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ కూడా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందే రష్యాను కూడా మోదీ సందర్శించిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని పొలాండ్‌ను సందర్శించారు. అలాగే భారత ఎన్నికల్లో మోదీ విజయానికి కూడా జెలన్‌స్కీ శుభాకాంక్షలు చెప్పారు. పొలాండ్‌ నుంచి 7 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి ఉక్రెయిన్‌కు చేరారు మోదీ. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News