Pfizer vaccine usage conditions: ఫైజర్ వ్యాక్సిన్ తయారీదారులైన బయోంటెక్ ఫార్మా కంపెనీ ప్రపంచానికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాకు చెక్ పెట్టేందుకు శక్తివంతమైన వ్యాక్సిన్స్‌లో ఒకటిగా పేరొందిన ఫైజర్ వ్యాక్సిన్‌కి (Pfizer-BioNTech vaccine) ఔషదం పరంగా మంచి పేరే ఉన్నప్పటికీ.. వినియోగంలోనే ఇప్పటివరకు ఉన్న కొన్ని ప్రతీకూలమైన అంశాలు ఆ వ్యాక్సిన్ వినియోగానికి అడ్డుగా నిలిచాయి. ఫైజర్ వ్యాక్సిన్లను నిల్వ చేయాలంటే కనీసం -80 నుంచి -60 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కానీ అంత అత్యల్ప స్థాయి కోల్డ్ స్టోరేజ్ కండిషన్ సిస్టం భారత్‌లో లేదు. అంతేకాకుండా ఒకసారి కోల్డ్ స్టోరేజీలోంచి బయటకు తీస్తే 5 రోజుల వరకే ఫ్రిజ్‌లో నిల్వ చేసేందుకు వీలు ఉండేది. భౌగోళిక వాతావరణ పరిస్థితుల వల్ల ఇందుకు అనుకూలించని కొన్ని ప్రపంచ దేశాలు ఫైజర్ వ్యాక్సిన్‌పై అంతగా ఆసక్తి చూపలేదు.
Also read: Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?
అయితే తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ తయారీలో పలు మార్పులు చేసిన తయారీదారులు.. వ్యాక్సిన్‌ని నిల్వ చేసే విధానంలోనూ మార్పులు తీసుకురాగలిగారు. -15 నుంచి -25 డిగ్రీల వద్ద వ్యాక్సిన్‌ని నిల్వ చేయగలగడం, అలాగే శీతలీకరణ వ్యవస్థ నుంచి బయటకు తీసిన తర్వాత ఫ్రిజ్‌లోనూ నెల రోజుల పాటు 2-8 డిగ్రీల ఫ్రీజింగ్ కండిషన్‌లో నిల్వ ఉండే సామర్ధ్యం పెంపు వంటి అంశాలు తిరిగి ఫైజర్ వ్యాక్సిన్‌పై ఆశలు రేకెత్తించేలా చేస్తున్నాయి.
ఫైజర్ వ్యాక్సిన్‌లో (Pfizer vaccine) ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. రెండు డోసుల మధ్య విరామం కేవలం 21 రోజులే. కొవాక్సిన్ వ్యాక్సిన్ (Covaxin vaccine) విషయంలో ఈ గ్యాప్ 4-6 వారాలు కాగా కొవీషీల్డ్ వ్యాక్సిన్ (Covishield vaccine) విషయంలో 12-16 వారాలుగా ఉంది.
Also read: COVID-19 Vaccine: భారత్‌లో కరోనా వేరియంట్లపై ఏ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook