Python attack on woman in Thailand: అడవులు, కొండ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో తరచుగా పాములు, కొండ చిలువలు ఎక్కువగా వస్తుంటాయి. దట్టమైన చెట్లు, సరస్సులలో కూడా పాములు ఎక్కువగా ఉంటాయి. పాములు, కొండ చిలువకుచెందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొంత మంది నెటిజన్ లు వీటిని చూసి షాక్ అవుతుంటారు. కానీ మరికొందరు మాత్రం, పాములు,కొండ చిలువల వీడియోలు చూసేందుకు ఆసక్తిని సైతం చూపిస్తుంటారు.
A resident of Thailand spent almost two hours fighting a four-meter python that attacked her while she was washing dishes, bit her several times and tried to strangle her.
A neighbor eventually came running to the noise and called the rescuers. The woman survived and did not… pic.twitter.com/CoCSPuMr6s
— Trending News (@Trend_War_Newss) September 18, 2024
చాలా మంది పాములు కానీ లేదా కొండ చిలువలు కానీ.. కన్పిస్తే.. వెంటనే స్నేక్ హెల్పింగ్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తుంటారు. పొరపాటు కూడా వాటిజోలికి పోయేందుకు అస్సలు సాహాసం చేయరు. ఈ క్రమంలో ఒక భారీ కొండ చిలువ ఒక మహిళను చుట్టేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ రాజధాని సముత్ ప్రకాశ్ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతం దట్టమైన అడవులకు ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇక్కడకు తరచుగా పాములు, కొండ చిలువలు విషపు కీటకాలు వస్తుంటాయి. అయితే.. 64 ఏళ్ల ఆరోమ్ అనే మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. సదరు మహిళ కిచెన్ లో వంట చేస్తుంది. అప్పుడు ఒక భారీ కొండ చిలువ, బైటకు వచ్చింది. ఆమెపైకి దాడికి దిగింది.
వెంటనే మహిళ భయపడి కిందపడిపోయింది. అప్పుడు ఆ భారీ కొండ చిలువ ఆమెను బలంగా చుట్టేసుకుంది. ఆమె ఊపిరాడక రెండు గంటల పాటు నరకం అనుభవించింది. ఆమె గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
Read more: Romance Video: బస్సులో రెచ్చిపోయిన లవర్స్.. సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్.. వీడియో వైరల్..
ఈ నేపథ్యంలో.. వాళ్లు వచ్చి. .. సదరు కొండ చిలువ నుంచి మహిళ ప్రాణాలు కాపాడారు. కానీ అప్పటికే ఆ కొండ చిలువ పలు మార్లు ఆమెను కాటు వేసినట్లు తెలుస్తోంది. వెంటనే సదరు మహిళన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బైటపడినట్లు తెలుస్తోంది. దీనికి చెందిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.