America: కరోనా మహమ్మారి సమయంలో అగ్రరాజ్యం ఇండియాకు అండగా నిలిచింది. కరోనా విపత్కర పరిస్థితుల వేళ భారత్‌కు సహాయం కొనసాగుతుందని..అన్ని విధాలా అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది.
కరోనా వైరస్(Corona Virus) దేశాన్ని కుదిపేస్తోంది. కరోనా విపత్కర పరిస్థితులతో దేశం అల్లకల్లోలమైంది. ఆక్సిజన్, అత్యవసర మందులు, వైద్య సామగ్రి కొరత తీవ్రమైంది. ఈ క్రమంలో అమెరికా, సౌదీ అరేబియా, మలేషియా, టర్కీ, సింగపూర్ దేశాల్నించి పెద్దఎత్తున ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు(Oxygen Concentrators), వైద్య సామగ్రి అందాయి. ఇంకా అందుతున్నాయి. ఈ నేపధ్యంలో అగ్రరాజ్యం అమెరికా(America) నుంచి పెద్దఎత్తున సహాయం అందుతోంది. కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న వేళ అమెరికా ఇండియాకు అండగా నిలుస్తుందని మరోసారి స్పష్టం చేసింది. ఇండియాకు అందిస్తున్న సహాయం ఇకపై కూడా కొనసాగుతుందని తెలిపింది.
ఇండియాకు వంద మిలియన్ డాలర్ల విలువైన మెడికల్ సహాయాన్ని అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden) తెలిపారు. ఇప్పటికే ఏడు విమానాల ద్వారా ఇండియాకు సహాయం అందించిన సంగతి గుర్తు చేశారు. ఏడవ షిప్‌మెంట్‌లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపించామన్నారు. కరోనాతో పోరాడుతున్న భారతీయులకు ఉపయోగపడుతాయన్నారు. ఇండియా తమకిష్టమైన భాగస్వామి అని ప్రశంసించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాణాత్మక సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.
Also read: Pfizer vaccine: గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్ వ్యాక్సిన్ మేకర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook