US Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చికాగోలో సోమవారం (జూలై 4) నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనతో పరేడ్‌లో పాల్గొన్న వందలాది మంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. చికాగోలోని హైల్యాండ్ పార్క్ వద్ద ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల బాబీ అనే యువకుడు ఈ కాల్పులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు.
హైల్యాండ్ పార్క్ ప్రదేశంలోని ఓ బిల్డింగ్ రూఫ్ టాప్ పైనుంచి దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అదే ప్రదేశంలో రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల అనంతరం అతను పారిపోగా.. పోలీసులు అతని ముఖచిత్రాన్ని విడుదల చేశారు. కాల్పుల ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అతన్ని పట్టుకోగలిగారు. పోలీసులు వెంబడిస్తుండటంతో యూఎస్ హైవే 41 వద్ద అతను పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
కాల్పుల ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరిని 78 ఏళ్ల నికోలస్ టోలెడోగా గుర్తించారు. మిగతా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కాల్పుల ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్పుల శబ్ధం వినగానే పరేడ్‌లో పాల్గొన్న చాలామంది పరుగులు పెట్టడం అందులో గమనించవచ్చు. షూటర్.. షూటర్ అంటూ వారంతా అక్కడినుంచి పరిగెత్తారు. కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతీ నెలా ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. అమాయక ప్రజలు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read: Horoscope Today July 5th: నేటి రాశి ఫలాలు.. ఆ రంగాల్లోని వ్యాపారులకు ఇవాళ ధన లాభం...
Also Read: God Father: మెగా అభిమానులకు ఇక పునకాలే.. గాడ్ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్డేట్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook