H 1B Visa Registrations: అమెరికాలో వీసా అలర్ట్. 2023 ఆర్థిక సంవత్సరం కోసం.. అమెరికా వర్క్ వీసా అయిన హెచ్-1బీ కోసం రిజిస్ట్రేషన్లు 2022 మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2022 మార్చి 18 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉండనుంది.
ఈ 18 రోజుల సమయంలోనే పిటిషనర్లు, ప్రతినిధులు (పిటిషనర్ తరఫున వీసాకోసం అప్లయ్ చేసే వారు) ఆన్లైన్ ద్వారా హెచ్-1బీ వీసాకోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో పేర్కొంది.
2023 ఆర్థిక సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి హెచ్-1బీ క్యాప్ కోసం ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ నంబర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ను ట్రాక్ చేయొచ్చని పేర్కొంది. దరఖాస్తు స్టేటస్‌ను మాత్రం ఈ నంబర్ ద్వారా ట్రాక్ చేయలేరని స్పష్టం చేసింది.
రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతంటే..
హెచ్-1బీ వీసా కోసం పిటిషనర్లు, వారి తరఫు ప్రతినిధులు myUSCIS ఆన్లైన్ అకౌంట్‌ను వినియోగించాలని తెలిపింది యూఎస్సీఐఎస్. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో అభ్యర్థి 10 డాలర్లు పీజపు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.
స్వియ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు.. ఫిబ్రవరి 21 నంచి myUSCIS ఆకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చని వివరించింది. మార్చి 31 నాటికి ఎంపిక దరఖాస్తుకు ఎంపికైన వారి వివరాలు.. myUSCIS అకౌంట్‌కు అందుతాయని పేర్కొంది.
ఏమిటి ఈ హెచ్-బీ వీసా?
అమెరికాలో పని చేయాలంటే విదేశీయులకు హెచ్-1బీ విసా తప్పనిసరి. పరిమితకాలంతో ఈ వీసాను ఇస్తుంది అమెరికా ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని టెక్ నిపుణులు హెచ్-1బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. వారిలో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది.
ప్రతి ఎటా లక్షలాది మంది ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే వీసాలు జారీ చేస్తుంది ప్రభుత్వం. దరఖాస్తుల సంఖ్య భారీగా ఉంటే.. లాటరీ విధానంలో ఎంపిక ఉంటుంది.
వ్యక్తిగతంగా చాలా మంది హెచ్-బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోగా.. కొన్ని సంస్థలు కూడ తమకు కావాల్సిన నిపుణులను నియమించుకునేందుకు వీసాను స్పాన్సర్ చేస్తుంటాయి.
ఇది ఒక నాన్ ఇమిగ్రెంట్ వీసా. అంటే.. ఈ వీసా వస్తే కేవలం అక్కడ మూడేళ్ల పాటు పని చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే ఈ వీసాను మరో మూడేళ్లు పొడగించుకునే వెసులుబాటు మాత్రం ఉంది. అంతే కానీ.. ఈ వీసాతో అమెరికాలో శాస్వతంగా ఉండేందుకు వీలు లేదు.
హెచ్-1బీ వీసా ఉంటే కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండొచ్చా?
హెచ్-1బీ వీసా ఉన్న వారి తమ జీవిత భాగస్వామిని.. 21 ఏళ్లలోపు పిల్లలను తమతో పాటు అమెరికా తీసుకెళ్లవచ్చు.
అయితే వారికి హెచ్-4 వీసా అవసరం అవుతుంది. దీనిని డిపెండెంట్ వీసా అని పిలుస్తారు. హెచ్-4 వీసా ఉన్న వాళ్లు అమెరికాలో పని చేయడానికి వీలు లేదు. అయితే పిల్లలకు మాత్రం అమెరికాలో చదువుకునే వెసులుబాటు ఉంటుంది.
Also read: Corona health Issues: కరోనా నుంచి కోలుకున్నా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు!
Also read: Coronavirus Spread: కరోనా వైరస్ 7 నెలల వరకూ సజీవంగానేనా..నిర్ఘాంతపోయే నిజమిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook