US safety mandate to fight drunk driving: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారిన వాటిలో రోడ్డు ప్రమాదాలు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల (Road accidents) కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంతకన్నా ఎక్కువ మంది అంగవైకల్యానికి గురవుతున్నారు.
రోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధాన కారణాల్లో ఒకటిగా చాలా సర్వేల్లో తేలింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కట్టడి చేసేందుకు (Drunk and Drive) పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రమాదాలు మాత్రం తగ్గటం లేదు.
అయితే ఇప్పుడు అలాంటి ప్రమాదాలను నివారించేందుకు సరికొత్త శాస్త్రీయ పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో అమెరికా ముందు వరుసలో ఉంది.
అమెరికాలో కార్ల వినియోగం అధికంగా ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరగకుండా.. కార్లలోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఏమిటి ఈ టెక్నాలజీ? ఎలా పని చేస్తుంది?
Also read: ప్రముఖ ర్యాపర్ ను కాల్చి చంపిన దుండగుడు, అమెరికాలో ఘటన
Also read: భూమికి పొంచి ఉన్న ముప్పు, ఆ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టనుందా
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించే సమయంలో పోలీసులు బ్రీత్ అనలైజర్ మిషన్‌ను వినియోగిస్తుంటారు. అచ్చం అలానే పని చేసే పరికరాన్ని కారులో ఇన్‌బిల్ట్‌గా పొందుపరచున్నారు. కారు నడిపే వ్యక్తి ముందుగా బ్రిత్ అనలైజర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొతాదుకు మించి మద్యం సేవించినట్లు ఆ మిషన్ గుర్తిస్తే.. ఆ కారు స్టార్ అవదు.
ప్రతికారులలో ఈ టెస్టింగ్ మిషన్ ఏర్పాటును తప్పనిసరి చేసే విధంగా ఓ రూల్‌ను తీసుకురానున్నారట. ఈ టెక్నాలజీ ఉంటే.. మోతాదుకు మించి మద్యం సేవించినవారు కారు నడిపేందుకు వీలుండదు. దీనితో ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని అమెరికా భావిస్తోంది. అమెరికా ఇటీవలే ఈ రూల్స్‌కు అమెరికా ప్రభుత్వం అమోదం తెలిపగా.. అమలులోకి వచ్చేందుకు మాత్రం కాస్త సమయం పట్టనుంది.
అమెరికాలో ఈ విధానం విజయవంతమైతే.. రానున్న రోజుల్లో ఇది ఇతర దేశాలకు విస్తరించే అవకాశముంది.
అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టెక్నాలజీతో ఈ వ్యవస్థ పని చేయనుది. డ్రైవర్ శ్వాసను సంగ్రహించేలా ఈ ఓ విధమైన సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థ డ్రైవర్ శ్వాసతోపాటు, చేతి వేళ్ల ద్వారా రక్తంలోన అల్కహాల్ శాతాన్ని లెక్కించగలుగుతుంది.
Also read: కోవిడ్ ట్యాబ్లెట్స్‌పై ఫైజర్ కీలక నిర్ణయం, ఇతర కంపెనీలకు అనుమతులు
Also read: ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్ .. వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook