ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన హీరో. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు తమ యూకే సైతం కరోనా వైరస్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోంటుందని బాధపడ్డారు. ఆయన 100వ పుట్టినరోజు వేడుకల సందర్బంగా దేశానికి ఇప్పుడు కూడా ఏదైనా చేయాలని భావించారు. ఏకంగా రూ.290కోట్ల విరాళాన్ని సేకరించి, కరోనాపై పోరాటానికి అందజేసి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు మాజీ కెప్టెన్ టామ్ మూరే. కోవిడ్19 యాప్ లాంచ్ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇక వివరాలు మీ చేతుల్లో!
ప్రస్తుతం బ్రిటన్‌లో సరిపడినంతగా ఫేస్ మాస్క్‌లు, గ్లోవ్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్మెంట్ (PPE) లేవు. చాలా మంది తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు, కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో రెండో ప్రపంచ యుద్ధ రంగంలో ధైర్ సాహసాలు ప్రదర్శించిన మాజీ కెప్టెన్ టామ్ మూరేను కరోనా వైరస్ మరణాలు, బాధలు కదిలించాయి. Pics: హాట్ ఫొటోలతో కవ్విస్తోన్న శ్రియ
Thank you @TesniJonesmusic and all the @NHSuk heroes who contributed to this special birthday message#100thbirthday#TomorrowWillBeAGoodDay https://t.co/mrFz3mko85
— Captain Tom Moore (@captaintommoore) April 30, 2020
చర్మ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయనకు ఇటీవల ఓ సర్జరీ కూడా జరిగింది. అయినా సరే కరోనాపై పోరాటంలో భాగస్వాముడు కావాలని భావించారు. ఓ ఛారిటీ సంస్థతో మాట్లాడి 100 స్టెప్స్ వాక్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చి విజయవంతంగా పూర్తిచేశారు. శరీరం సహకరించకపోయినా నమ్మకం, ధైర్యం, తెగువ ఉంటే ఏదైనా చేయవచ్చునన్న నమ్మకాన్ని బ్రిటన్ ప్రజలకు కల్పించారు. టామ్ మూరే నడిచే సమయంలో విరాళాల వర్షం కురిసింది. ఏకంగా రూ.290కోట్ల విరాళాలు రాగా, వాటిని కరోనాపై పోరాటానికి తన వంతు సాయంగా అందించారు. Pics: క్యాలెండర్ గాళ్ సొగసు చూడతరమా!
ఆయన జీవితంలో ఇది మూడో అతి పెద్ద పోరాటం. 1920లో జన్మించిన టామ్ మూరే తొలుత స్పానిష్ బారి నుంచి బయటపడ్డారు. తర్వాత 1939 నుంచి 1945 మధ్యకాలంలో 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడారు. ప్రస్తుతం కరోనా రక్కసిపై పోరాటానికి పిడికిలి బిగించి దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచారు. కరోనా వల్ల బ్రిటన్‌లో 26వేలకు పైగా మరణాలు సంభవించాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!