Elon Musk Twitter: ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. భారీ డీల్ ​డీటెయిల్స్ ఇవే?

Elon Musk buy Twitter. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ కొనుగోలు విషయంలో తన పంతం నెగ్గించుకునేలా ఉన్నారు. మరొకొన్ని గంటల్లో ట్విట్టర్ సంస్థ మొత్తానికి ఆయన యజమాని కానున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 10:25 PM IST
  • పంతం నెగ్గించుకున్న ఎలాన్ మస్క్
  • ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్
  • ట్విట్టర్ భారీ డీల్ ​డీటెయిల్స్ ఇవే
 Elon Musk Twitter: ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. భారీ డీల్ ​డీటెయిల్స్ ఇవే?

Twitter likely to sell to Elon Musk for 43 billion Dollers: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ కొనుగోలు విషయంలో తన పంతం నెగ్గించుకునేలా ఉన్నారు. మరొకొన్ని గంటల్లో ట్విట్టర్ సంస్థ మొత్తానికి ఆయన యజమాని కానున్నారు. ఎలాన్ మస్క్ ఇచ్చిన భారీ డీల్‌పై ట్విట్టర్ సంస్థ ఈరోజు రాత్రి లోపు ఓ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించిన 10 రోజుల తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం టెస్లా సీఈఓతో ట్విట్టర్​ బోర్డు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఎలాన్ మస్క్‌ ఒక్కో ట్విట్టర్‌ షేరుకు 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తున్నారని సమాచారం. టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ చీఫ్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌కు మొత్తంగా 43 బిలియన్ డాలర్ల టేకోవర్ బిడ్‌ను ఆఫర్ చేసారట. ఈ భారీ డీల్‌కు ట్విట్టర్ ఓకే చెప్పిందట. ఆదివారం మస్క్ ఆఫర్‌ను ట్విట్టర్ పునఃపరిశీలించడం ప్రారంభించిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నుంచి వచ్చిన తాజా నివేదిక ప్రకారం.. ట్విట్టర్‌, ఎలాన్ మస్క్‌ మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయట. 

ఎలాన్ మస్క్‌ ఒక్కో ట్విట్టర్‌ షేరుకు 54.20 డాలర్ల చొప్పున.. 43 బిలియన్‌ డాలర్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన పలు బ్యాంకులలో 46 బిలియన్‌ డాలర్ల రుణాన్ని కూడా సిద్ధంగా ఉంచారట. ట్విట్టర్‌ బోర్డుతో సంబంధం లేకుండా.. టెండర్‌ ఆఫర్‌ ద్వారా మస్క్‌ నేరుగా వాటాదారులతో చర్చలు జరిపారట. 

ప్రస్తుతం ట్విట్టర్‌ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమవుతూ వస్తోందని ఎలాన్ మస్క్‌ కొన్ని రోజుల క్రితం ఆరోపించారు. తాను ఆఫర్‌ చేసిన ధర కంటే మంచి విలువను తీసుకురావడం ప్రస్తుత ట్విట్టర్‌ యాజమాన్యానికి సాధ్యం కాదన్నారు. మరోవైపు ట్విట్టర్‌ ఆదాయం కోసం ప్రకటనలపై ఆధారపడడాన్ని తగ్గించడం, ఎడిట్‌ బటన్‌, పొడవైన ట్వీట్లను అనుమతించడం లాంటి పలు మార్పులను మస్క్‌ ఇప్పటికే సూచించారు.

Also Read :Acharya Ticket Price Hike: ఆచార్య టికెట్ల పెంపునకు అనుమతిచ్చిన తెలంగాణ సర్కార్!

Also Read: Neha Dhupia Yoga Pics: నేహా దూపియా యోగా పిక్స్.. క‌త్రినా కైఫ్‌ ఫిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News