రష్యా సరస్సులో కూలిన పర్యాటక హెలీకాప్టర్, 7 మంది గల్లంతు

Russian Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కమ్చట్కా పెనిన్సులా సమీపంలోని ఓ సరస్సులో హెలీకాప్టర్ కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 12, 2021, 03:01 PM IST
రష్యా సరస్సులో కూలిన పర్యాటక హెలీకాప్టర్, 7 మంది గల్లంతు

Russian Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కమ్చట్కా పెనిన్సులా సమీపంలోని ఓ సరస్సులో హెలీకాప్టర్ కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ముగ్గురు సిబ్బంది, 13 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఎంఐ 8 హెలీకాప్టర్(MI 8 Helicopter) రష్యా(Russia) తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న కురిల్ సరస్సులో కూలిపోయింది. ఈ ప్రాంతంలోని అగ్నిపర్వతాలు, సుందర ప్రదేశాల్ని చూసేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు.ఈ క్రమంలో హెలీకాప్టర్‌లో (Helicopter Crash)13 మంది పర్యాటకులున్నారు. సంఘటనా స్థలానికి 40 మందితో కూడిన సహాయక బృందాలు, గజ ఈతగాళ్లు చేరుకున్నారు.ఇప్పటికే 9 మందిని రక్షించారని..మిగిలినవారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఈ ప్రమాదంపై విచారణ చేపట్టినట్టు రష్యా దర్యాప్తు కమిటీ తెలిపింది. కమ్చట్కా పెనిన్సులా(Kamchatka Peninsula) సుందరమైన పర్యాటక ప్రాంతంగా పేరు గాంచింది. తూర్పు మాస్కోకు 6 వేల కిలోమీటర్ల దూరంలోనూ, అలాస్కాకు 2 వేల కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. 

Also read: ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు ఇండో అమెరికన్ మహిళలకు స్థానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News