ఢిల్లీ : కరోనా వైరస్ (coronavirus) మహమ్మారి ప్రపంచంలోని దేశాలన్నింటిని పట్టిపీడిస్తోంది. కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య (coronavirus cases Across World) ఒక కోటి 87వేల 320 దాటింది. కోవిడ్‌తో ఇప్పటివరకు 5,01,419 మంది మరణించారు. నటి డ్యాన్స్‌కు 24గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్
ఇప్పటివరకు నమోదైన కేసుల్లో వ్యాధి నుంచి కోలుకున్న వారు 54 లక్షల 66వేల 185 మంది ఉండగా.. 41 లక్షల 19 వేల 716 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఎక్కువ కేసులు నమోదైన టాప్ ఐదు దేశాలు ఇవే..
- అమెరికాలో ఇప్పటివరకు 25,96,537 కేసులు నమోదు కాగా.. 1,28,152మంది మరణించారు. కరోనా ఇప్పటివరకు 10,81,437మంది కోలుకోగా.. ఇంకా 13,86,948 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- బ్రెజిల్లో 13,15,941 కేసులు నమోదు కాగా.. 57,103మంది మరణించారు. ఇప్పటివరకు 7,15,905 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 5,42,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్లాస్‌మేట్‌కు మత్తు మందిచ్చి బీటెక్ విద్యార్థుల అఘాయిత్యం
- రష్యాలో 6,27,646 కేసులు నమోదు కాగా.. 8,969మంది మరణించారు. ఇప్పటివరకు 3,93,352 మంది కోలుకోగా... 2,25,325మంది చికిత్స పొందుతున్నారు.
- భారతదేశంలో ఇప్పటివరకు 5,28,859 కేసులు నమోదు కాగా.. 16,095మంది మరణించారు. ఈ వ్యాధితో 3,09,713 మంది కోలుకోగా.. ఇంకా 2,03,051 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- బ్రిటన్‌లో 3,10,250 కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 43,514 మంది ఈ మహమ్మారితో మరణించారు.జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ