Endless Love: వయస్సు 72 ఏళ్లు..మృత భార్యతో సహ జీవనం. ఎట్టకేలకు 21 ఏళ్ల తరువాత అంత్యక్రియలు. ఎక్కడ జరిగింది. ఎవరా వ్యక్తి.
భార్యపై అసాంతం పెంచుకున్న ప్రేమ ఫలితమది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 ఏళ్లుగా సహ జీవనం. ఆశ్చర్యమేంటనుకుంటున్నారా..సహ జీవనం చేసింది సజీవంగా ఉన్న భార్యతో కాదు..మరణించిన భార్య శరీరంతో. అలాగని వయసులో ఉన్న వ్యక్తేమీ కాదు. 72 ఏళ్ల వయస్సులో. ఆ వివరాలు పరిశీలిద్దాం..
ధాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు చెందిన 72 ఏళ్ల రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ చర్న్ జాన్వచకల్ ఇతడు. రెండు దశాబ్దాలకు పైగా మరణించిన భార్యతో సహ జీవనం చేసి..చివరికి అంతులేని ప్రేమకు ముగింపు పలుకుతూ..కన్నీటితో భార్యకు అంత్యక్రియలు చేశాడు. మమ్..నీవు ఎక్కడికో వెళ్లడం లేదు..తిరిగి ఇంటికొస్తావు. నేను కూడా ఎక్కువ కాలముండను. ప్రామిస్ చేస్తున్నా అంటూ ఆవేదన చెందడం వీడియోలో చూడవచ్చు. వాస్తవానికి ఇప్పుడు కూడా అంత్యక్రియలు చేసేవాడు కాదట. భార్య అంత్యక్రియలు చేయకుండా తానెక్కడ చనిపోతానోననే ఆందోళన ఎక్కువైంది అతనికి. అందుకే ఓ స్వచ్ఛంధ సంస్థ సహకారంతో అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు.
బ్రెయిన్ ఎన్యూరిజమ్ కారణంగా ఒక్కసారిగా అధిక రక్తపోటుతో అతడి భార్య మరణించింది. బౌద్ధ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలకు తీసుకెళ్లినా...నిరాకరించి..భార్య మృతదేహాన్ని కఫిన్ బాక్స్‌లో ఉంచి సహజీవనం చేశాడు.
Also read: Russia Bomb Attacks: ఉక్రెయిన్ స్కూలుపై రష్యా బాంబు దాడులు, 60 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook