ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీలంక సర్కార్ !!

ఉగ్రదాడులను నిలువరించడంలో వైఫల్యం చెందినందుకు శ్రీలంక ప్రభుత్వం దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పింది.

Last Updated : Apr 23, 2019, 09:09 PM IST
ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీలంక సర్కార్ !!

ఉగ్రదాడుల ఘటనపై శ్రీలంక ప్రభుత్వం దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఉగ్రమూకలు రెచ్చిపోయిన నరమేధం సష్టించినప్పటికీ ప్రభుత్వ వైఖల్యంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో స్పందించిన శ్రీలంక ప్రభుత్వం...ముందస్తు సమాచారం ఉన్నా దాడులు ఆపలేకపోయాం... క్షమించండి! అంటూ  శ్రీలంక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ ప్రతినిధి రజిత సేనరత్నే పేరిట ఆ ప్రకటన వెలువడింది. దాడి విషయంలో తమకు నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నా తగిన రీతిలో స్పందించలేకపోయమన్నారు. తమ వైఫల్యంపై బాధితుల కుటుంబాలకు, సంస్థలకు ప్రభుత్వం క్షమాపణలు కోరారు. ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేము కానీ.. బాధితుల కుటుంబాలను పరిహారం చెల్లించడంతోపాటు దెబ్బతిన్న చర్చిల పునర్నిర్మాణం బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుంది అని ప్రకటనలో పేర్కొన్నారు

శ్రీలంకలో ఉగ్రమూకలు రెచ్చిపోయి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పవిత్ర ఈస్టర్‌ రోజున ప్రసిద్ధ చర్చిలు, విదేశీయులు ఎక్కువగా ఉండే స్టార్‌ హోటళ్లను లక్ష్యంగా  ఉగ్రమూమల జరిపిన ఈ భీభత్సవంలో 321 మంది అమాయకులు బలయ్యారు. కాగా ఈ దాడిలో  500 మందికిపైగా  గాయాలపాలైయ్యారు.ఈ నేపపథ్యంలో శ్రీలంక సర్కార్ ఈ మేరకు క్షమాపణలు చెప్పింది
 

Trending News