'స్పైడర్‌ మ్యాన్' సహ సృష్టికర్త డిట్కో కన్నుమూత

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచూర్యం పొందిన 'స్పైడర్‌ మ్యాన్' యానిమేషన్ సహ సృష్టికర్త స్టీవ్ డిట్కో కన్నుమూశారు.

Last Updated : Jul 7, 2018, 06:12 PM IST
'స్పైడర్‌ మ్యాన్' సహ సృష్టికర్త డిట్కో కన్నుమూత

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన 'స్పైడర్‌ మ్యాన్' యానిమేషన్ సహ సృష్టికర్త స్టీవ్ డిట్కో కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. న్యూయార్క్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. జూన్ 29వ తేదీన ఆయన తన కుటుంబసభ్యుల సమక్షంలో తుదిశ్వాస విడిచినట్లు మర్వెల్ స్టూడియోస్ ప్రకటించింది. డిట్కో మృతి పట్ల ప్రఖ్యాత రచయిత నీల్ గేమన్ నివాళి అర్పించారు.

మార్వెల్ కామిక్స్ కోసం డిట్కో పనిచేశారు.  'స్పైడర్‌ మ్యాన్' పాత్రకు దృశ్యరూపం ఇవ్వడంతో పాటు 'డాక్టర్ స్ట్రేంజ్' పాత్రను కూడా డిట్కోనే డిజైన్ చేశారు. 1960 దశకం తొలి రోజుల్లో ఆయన 'స్పైడర్‌ మ్యాన్' క్యారక్టర్‌ను డిజైన్ చేశారు. సాలీడు శక్తులతో టీన్ సూపర్‌ హీరోను క్రియేట్ చేయాలని భావించారు. దానికి తగ్గట్టుగా డిట్కో 'స్పైడర్‌ మ్యాన్' పాత్రకు ప్రాణం పోశారు. బ్లూ, రెడ్ డ్రెస్‌ వేషధారణతో పాటు మణికట్టులో వెబ్ సూటర్స్ ఉన్న స్పైడర్‌ మ్యాన్‌ను డిట్కోనే డిజైన్ చేశారు.

 

Trending News