Parliament Attack Threat: సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థ ముఖ్యుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి ఇండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. డిసెంబర్ 13 వరకూ భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించడం ఆందోళన రేపుతోంది. కెనడా నుంచి చేసి ఈ హెచ్చరికలు మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచనున్నాయి.
కెనడాలో ప్రత్యేక ఖలిస్తాన్ వేర్పాటువాది, ఉగ్రవాదిగా ముద్రపడిన హర్దీప్ సింగ్ నిజ్జార్ జూన్ నెలలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇండియా కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచాయి. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారతీయ ఏజెన్సీల హస్తముందనేది కెనడా ప్రదాని ట్రూడే చేసిన ఆరోపణ. ఆ తరువాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సెట్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థ ఛీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూు చేసిన బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.
డిసెంబర్ 13 నాటికి భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామనేది ఈ బెదిరింపు సారాంశం. డిసెంబర్ 13 అంటే 2001లో భారత పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజు. 22 ఏళ్లు పూర్తవుతుంది. అంతేకాదు అమెరికా తన హత్యకు భారత్ చేపట్టిన కుట్ర విఫలమైందనే వీడియోను కూడా విడుదల చేశాడు. ఢిల్లీ బనేగా ఖలిస్తాన్ అనే టైటిల్‌తో 2001 పార్లమెంట్ దాడి దోషి అఫ్జలు గురు పోస్టర్‌ను వీడియోలో ప్రదర్శించాడు గురుపత్వంత్ సింగ్ పన్నూ. తనను చంపేందుకు భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని చెప్పుకొచ్చాడు. దీనికి ప్రతీకారంగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని హెచ్చరించాడు.
గురుపత్వంత్ సింగ్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వముంది. ఇతనిపై జరిగిన హత్యకు కుట్రకు బాధ్యుడి భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా అని యూఎస్ అటార్నీ ఇటీవల ప్రకటించింది. నిఖిల్ గుప్తాతో భారతీయ ఏజెన్సీ ఉద్యోగితో సంబంధముందని. పన్నూను హత్య చేసేందుకు గుప్తాను కిరాయికి మాట్లాడుకున్నట్టుగా అమెరికా నిఘా వర్గాలు తేల్చాయి. ప్రస్తుతం డిసెంబర్ 2వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 22వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఇప్పుడు పన్నూ బెదిరింపుల నేపధ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
Also read: North Korea: చలించిన కర్కశ గుండె, కన్నీరు పెట్టుకున్న నియంత, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook