Mouse find in Scandinavian air lines: విమాన ప్రయాణాలను చాలా మంది చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది లైఫ్ లో ఒక్కసారైన ఫ్లైట్ లో ఎక్కాలని చెప్తుంటారు. ఇదిలా ఉండగా.. విమానంలో కొన్నిసార్లు బాంబులు పెట్టారని అత్యవసరంగా ల్యాండ్ చేస్తుంటారు. మరికొన్నిసార్లు విమానంలో ఎవరికైన ఎమర్జెన్సీ కారణాలతో విమానంను ల్యాండ్ చేస్తుంటారు. కొన్నిసార్లు ప్రయాణికుల మధ్య గొడవల ఇలా రకరకాల కారణాల వల్ల విమానంను మధ్యలోనే తిరిగి ఎక్కడైన ల్యాండ్ చేస్తుంటారు. పక్షి ఢీకొన్ని సందర్భాలు, వాతావరణ పరిస్థితులు, మొదలైన కారణాలతో కూడా అనేక మార్లు ఫ్లైట్ల ను మధ్యలోనే దించేస్తుంటారు.
ఇదిలా ఉండగా.. మనం తరచుగా హోటల్స్, రెస్టారెంట్ల కు వెళ్తుంటాం. అక్కడ ఫుడ్ ఐటమ్స్ లను సర్వ్ చేస్తుంటారు. అంతేకాకుండా.. కొన్నిసార్లు మనం తినే ఫుడ్ లో బొద్దింకలు, చనిపోయిన జంతువుల అవశేషాలు, మొదలైనవి వచ్చిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. తాజాగా, ఒకవిమానంలో కూడా ప్రయాణికుడి ఫుడ్ లో ఎలుక వచ్చింది. కానీ అది బతికున్న ఎలుక. దీంతో పెద్ద రచ్చగా మారింది.
పూర్తి వివరాలు..
నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మాలాగాకు ప్రయాణికులతో స్కాండినేవియన్ సంస్థకు చెందిన ఎయిర్‌లైన్స్ విమానం స్టార్ట్ అయ్యింది. ప్రయాణికులకు విమాన సిబ్బంది.. భోజనం ప్యాకెట్లు అందించారు. కొంత మంది ఆకలితో ఉండటంతో తొందరగా తమ ఫ్యాటెట్లను ఓపెన్ చేశారు. అప్పుడు.. ఒక మహిళ ప్రయాణికురాలికి బిగ్ షాక్ ఎదురైంది. ప్యాకెట్‌లో నుంచి ఓ చిట్టి ఎలుక బయటకు దూకింది. కళ్లు తెరిచి మూసేలోగా.. ఆ చిట్టెలుక మాయమైంది. అంతే విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది సైతం నానా హైరానా పడ్డారు.
ఈ చిట్టెలుక.. విమానంలోని వైర్లను కొరికితే .. తమ ప్రాణాలు గాల్లొనే పోతాయని భావించారు. వెంటనే ఉన్న ఫళంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఓస్లో ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులకు జరిగిన ఘటనను తెలిపారు. వారి ఆదేశాల మేరకు కోపెన్‌హాగన్‌కు మళ్లించి.... అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానాన్ని ల్యాండ్ చేశారు. అనంతరం ఈ విమానంలోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానాని కితరలించారు. దీంతో ప్రయాణికులు మాత్రం అమ్మబాబోయ్ అంటూ ఊపిరీ పీల్చుకున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.