Royal family infected: రాజ కుటుంబంలో 150 మందికి కరోనా!

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. తాజాగా సౌదీ రాజకుటుంబాన్ని కూడా పట్టిపీడిస్తోందట. న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించిన ఓ కథనం ప్రకారం సౌదీ రాజ కుటుంబంలో 150కిపైగా మంది వైరస్‌ బారినపడినట్లు తెలుస్తోంది.

Last Updated : Apr 10, 2020, 07:06 AM IST
Royal family infected: రాజ కుటుంబంలో 150 మందికి కరోనా!

రియాద్‌: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. తాజాగా సౌదీ రాజకుటుంబాన్ని కూడా పట్టిపీడిస్తోందట. న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించిన ఓ కథనం ప్రకారం సౌదీ రాజ కుటుంబంలో 150కిపైగా మంది వైరస్‌ బారినపడినట్లు తెలుస్తోంది. సౌదీ రాజ కుటుంబం చికిత్స పొందుతున్న ఆస్పత్రివర్గాలతో పాటు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తుల ద్వారా తమకు ఆ సమాచారం అందినట్టుగా న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. రాజ కుటుంబీకులతో పాటు వారికి సేవలు అందించే సిబ్బందికి సైతం కరోనా సోకినట్టుగా ఈ కథనంలో ప్రస్తావించారు.

Also read : Containment zones: హైదరాబాద్‌లో ఆ 12 ఏరియాల్లోకి నో ఎంట్రీ, నో ఎగ్జిట్

సౌదీ రాజు సల్మాన్‌ (Saudi king Salman), యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (Crown prince MBS) ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారని.. అలాగే రియాద్ గవర్నర్ అయిన 70 ఏళ్ల సౌది ప్రిన్స్ ఫైజల్ బిన్ బందర్ బిన్ అబ్జుల్ అజీజ్ అల్ సౌద్ సైతం ప్రస్తుతం ఐసీయూలో కరోనాకు చికిత్స పొందుతున్నారని ఈ కథనం వెల్లడించింది. ఒకవేళ వారిలోనే ఒకరి నుంచి మరొకరికి అన్నట్టుగా కరోనా వ్యాపిస్తే.. వారికి చికిత్స అందించేందు కోసమని రాజ కుటుంబీకులకు వైద్య సహాయం అందించే కింగ్ ఫైజల్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లో 500 పడకలను సిద్ధం చేశారు. 

Also read : 25 దేశాలకు హైడ్రోక్లోరోకిన్ ఎగుమతికి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్

అయితే, సౌదిలోని సీనియర్ డాక్టర్లకు ఇదే విషయాన్నితెలియజేస్తూ.. తమకు అందుబాటులో ఉండాల్సిందిగా కింగ్ ఫైజల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ సమాచారం అందించింది. ఆ విధంగా ఈ వార్త న్యూయార్క్ టైమ్స్ చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News