Russian helicopter with 22 onboard goes missing: రష్యా లో షాకింగ్ ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రష్యన్ ఫార్ ఈస్ట్‌లోని కమ్‌చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 హెలికాప్టర్ కన్పించకుండా పోయిందని రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇది ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్‌లైన్‌కు చెందిందని సమాచారం. వాచ్‌కాజెట్స్ అగ్నిపర్వతం సందర్శన సమయంలో .. హెలికాప్టర్ అదృశ్యమైనట్లు సమాచారం. రష్యాకు చెందిన ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ తప్పిపోయిన హెలికాప్టర్‌లో 22 మంది ఉన్నట్లు నివేదించింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగింది. ఈ ఘటనలో ఎంత మంది మరణించారనే సమాచారం తెలియాల్సి ఉంది. హెలికాప్టర్ అదృశ్యమైన సమయంలో అందులో ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు విచారణ చేస్తున్నారు.
ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా దీనివెనక మరే కారణముందాఅని అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. Mi-8 అనేది 1960లలో రూపొందించబడిన రెండు ఇంజిన్ల హెలికాప్టర్. ఇది రష్యాలో విస్తృతంగా ఉపయోగించబడుతుందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా .. ఇటీవల కాలంలో హెలికాప్టర్, విమాన ప్రమాదాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఈ హెలికాప్టర్ లలో సాంకేతిక సమస్యల వల్ల అనేక మంది రాజకీయ నేతలు, దేశాధినేతలు, ఆర్మీ అధిరులు సైతం తమ ప్రాణాలు కోల్పోయారు.
కొన్నిసార్లు హెలికాప్టర్ లను ఎంత బాగా టెస్ట్ లు చేసిన కూడా.. ఆకాశంలో ఏవో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆకాశంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం వల్ల కూడా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో రష్యాలో జరిగిన ప్రస్తుత.. హెలికాప్టర్ మిస్సింగ్ ఘటన మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.