Corona Deaths In Russia: రష్యాలో కరోనా మరణ మృదంగం.. మరణాల్లో సరికొత్త రికార్డు..!

రష్యాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ ధాటికి రికార్డు స్థాయిలో అక్కడ మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా కొవిడ్ తో 984 మంది మృత్యువాత పడ్డారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 09:17 PM IST
Corona Deaths In Russia: రష్యాలో కరోనా మరణ మృదంగం.. మరణాల్లో సరికొత్త రికార్డు..!

Corona Deaths In Russia: కరోనా మహమ్మారి రష్యా(Russia)లో విజృంభిస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 984మంది కొవిడ్‌తో ప్రాణాలు(Covid Deaths) కోల్పోగా.. 28,717 మంది ఇన్ఫెక్షన్‌ బారినపడినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. నిన్న 973 మరణాలు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య మరింతగా పెరగడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దంపడుతోంది. 

రష్యా(Russia)లో ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. కొవిడ్‌ సోకిన వారిలో 2,19,329మంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి మైఖేల్‌ మురాస్కో నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో తెలిపారు. యూరప్‌ ఖండంలో రష్యాలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అధికారిక గణాంకాల  ప్రకారం.. 7.8మిలియన్ల పాజిటివ్‌ కేసులు, 2,19,329 మరణాలు నమోదయ్యాయి.

Also read: Booster Dose: వారికి బూస్టర్‌ డోసు అవసరం అంటున్న డబ్ల్యూహెచ్‌ఓ

వ్యాక్సినేషన్‌(Vaccination) ప్రక్రియ మందకొడిగా సాగడం, కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వ యంత్రాంగం విముఖత ప్రదర్శించడంతో వైరస్‌ మళ్లీ తిరగబెడుతూ వేలాది మంది ప్రాణాలు బలిగొంటోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 29శాతం మంది ప్రజలు పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు రష్యా ప్రధానమంత్రి మైఖేల్‌ మిషుస్తిన్‌ చెప్పారు. వ్యాక్సినేషన్‌ స్పీడ్ పెంచాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Russian President Vladimir Putin)అధికారులను ఆదేశించారు. అక్కడ వ్యాక్సిన్లపై జరుగుతున్న దుష్ప్రచారంతో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకు రావటం లేదు. 

దేశంలో మరోసారి ఇంత భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నా కఠిన లాక్‌డౌన్(Lockdownz) విధించేందుకు క్రెమ్లిన్‌ విముఖత ప్రదర్శిస్తోంది. గతంలో విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు పుతిన్‌ రేటింగ్‌ తగ్గిపోయింది. దీంతో కొవిడ్‌ ఆంక్షలు అమలుచేసే అధికారాన్ని ప్రాంతీయ అధికార యంత్రాంగానికే అప్పగించారు. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ జన సమహాల కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News