ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య కరోనా వైరస్. ఇదివరకే భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా టీకాలు ఇస్తుండగా తాజాగా రష్యా రూపొందించిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వి సైతం దేశంలోకి దిగుమతి అవుతుంది. ఈ క్రమంలో రష్యా మరో ప్రకటన చేసింది. రెండు డోసులు తీసుకోవాల్సిన పనిలేదని ఒకే ఒక్క డోసుతో కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని రష్యా దేశం ప్రకటించింది.
ఒకే డోసు వ్యా్క్సిన్ స్పుత్నిక్ లైట్‌ను భారత్‌లో తీసుకొస్తామని రష్యా దౌత్యవేత్త నికోలే కుదషెవ్ ఆదివారం (మే 16) నాడు ప్రకటించారు. ఆ దిశగా రష్యా ఇదివరకే వ్యాక్సిన్లపై ప్రయోగాలు చేస్తుందని చెప్పారు. మరోవైపు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి రెండో బ్యాచ్ హైదరాబాద్‌కు నేడు చేరుకుంది. రష్యా ఏడాదికి 850 మిలియన్ డోసుల స్పుత్నిక్ వి కోవిడ్19 వ్యాక్సిన్(COVID-19 Vaccine) ఉత్పత్తి చేయాలని భావిస్తుందని రష్యా దౌత్యవేత్త నికోలే తెలిపారు. ఈ మేరకు వర్చువల్ సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. కరోనా కష్టకాలంలో భారత్, రష్యా దేశాల మధ్య సహాయ సహకారాలు పెంపొందుతున్నాయి.
Also Read: Covid-19: ఫేస్ మాస్కులు సుదీర్ఘకాలం వాడితే శరీరంలో Oxygen తగ్గుతుందా, నిజమేంటంటే
That is indeed a brilliant example of the special and privileged strategic partnership and an effective model of international anti-pandemic cooperation that does not know any unnecessary obstacles.@DrSJaishankar @MEAIndia @mfa_russia @IndEmbMoscow https://t.co/Cz2FlGUX6U
— Nikolay Kudashev 🇷🇺 (@NKudashev) May 16, 2021
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో రష్యా రూపొందించిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు భారీ డిమాండ్ వచ్చిందన్నారు. 2020లో ద్వితియార్థం నుంచి రష్యా తమ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్స్, రూపాంతరం చెందిన ప్రమాదకర కరోనా వేరియంట్లపై సైతం తమ వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని రష్యా నిపుణులు పేర్కొన్నారు. రష్యా వ్యాక్సిన్ అత్యవసర ఆమోదానికి ఏప్రిల్ 12న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్(Sputnik V Vaccine) ధర ప్రకటించింది.
Also Read: PM Kisan Samman Nidhi Status: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ, PM Kisan స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
We interact closely in the field of medical science, including w/ regard to new #COVID19 strains, maintain active, non-politicized dialogue in the framework of WHO, G20, BRICS. Life-saving humanitarian assistance delivered last month by the Russian side is being successfully used https://t.co/GmmprZvLdO
— Nikolay Kudashev 🇷🇺 (@NKudashev) May 16, 2021
మన దేశంలో ప్రస్తుతం పంపిణీ అవుతున్న టీకాలు కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కాగా, ఖరీదైన వ్యాక్సిన్‌గా రష్యా వ్యాక్సిన్ నిలిచింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర రూ.995.40గా రెడ్డీస్ లాబోరేటరిస్ ప్రకటించింది. భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేయనుంది.
Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం CoWin యాప్‌లో ఇలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి
Given the recent launch of the Russian vaccine in the Indian vaccination campaign, this second delivery has become very timely. The efficacy of the #SputnikV is well-known in the world. https://t.co/AcqoxHERBc
— Nikolay Kudashev 🇷🇺 (@NKudashev) May 16, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook