రైల్వే స్టేషన్‌లో భారీగా వర్షపు నీరు..ఈత కొడుతూ ఎంజాయ్ చేసిన ప్రయాణికులు

                                                            

Last Updated : Aug 2, 2018, 01:41 PM IST
రైల్వే స్టేషన్‌లో భారీగా వర్షపు నీరు..ఈత కొడుతూ ఎంజాయ్ చేసిన ప్రయాణికులు

భారీ వర్షాల కారణంగా ఆ రైల్వే స్టేషన్ లో భారీగా వర్షపు నీరు చేరింది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా పాజిటివ్ గా తీసుకున్నారు అక్కడి జనాలు..ఆ వర్షపు నీటిలో ఏకంగా ఈత కొడుతూ ఈత కొడుతూ ఎంజాయ్ చేశారు.. 

వివరాల్లోకి వెళ్లినట్లయితే సోమవారం కురిసిన భారీ వర్షాలకు యూరప్ దేశమైన స్వీడన్ లోని ఉప్సలా రైల్వేస్టేషన్ జలమయమైంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొందరు  ప్రయాణికులు తలలు పట్టుకుంటే..మరి కొందరు మాత్రం హాయిగా ఆ నీటిలో ఈత కొట్టడం మొదలుపెట్టారు.

వర్షపు నీటిలో ఏం చక్కా ఎంజాయ్ చేస్తున్న వారిని సెక్యూరిటీ గార్డులు బయటకు తీసుకొచ్చారు. విద్యుత్ వైర్లు నీటిలో మునిగిన కారణంగా విద్యుత్ షాక్ కొట్టే అవకాశం ఉండటంతో అధికారులు నీటిలోకి దిగేందుకు అనుమతించలేదు. చివరికి నీటినంతా తోడేసి పరిస్థితిని మామూలు స్థితికి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

Trending News