Pfizer COVID-19 Vaccine: భారత్‌కు 50 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల సరఫరాకు అమెరికా ఫార్మా సంస్థ రెడీ

Pfizer COVID-19 Vaccine : ఇదివరకే కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఇస్తుండగా, ఇటీవల స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తాజాగా డీఆర్‌డీవో రూపొందించిన 2డీజీ డ్రగ్ మార్కెట్లోకి విడుదల కానుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : May 27, 2021, 11:20 AM IST
  • భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అధిక ఉత్పత్తికి పెరుగుతున్న డిమాండ్
  • భారత్‌కు అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ వ్యాక్సిన్ అందించేందుకు సిద్దం
  • 12 ఏళ్లు పైబడిన వారికి టీకాలు పనిచేస్తాయని ప్రకటించిన ఫైజర్ సంస్థ
Pfizer COVID-19 Vaccine: భారత్‌కు 50 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల సరఫరాకు అమెరికా ఫార్మా సంస్థ రెడీ

 దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలో వేగవంతం కానుంది. ఇదివరకే కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఇస్తుండగా, ఇటీవల స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తాజాగా డీఆర్‌డీవో రూపొందించిన 2డీజీ డ్రగ్ మార్కెట్లోకి విడుదల కానుంది. వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ భారత్‌కు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల టీనేజ్ వయసు వారికి కావాల్సిన టీకాలపై ఫోకస్ చేస్తున్న తరుణంలో తాము ఫైజర్ టీకాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ఫార్మా సంస్థ ప్రకటించింది. ఫైజర్ కరోనా (COVID-19) టీకాలను 12 ఏళ్లు పైబడిన ఎవరికైనా ఇవ్వవచ్చునని స్పష్టం చేసింది. అయితే భారత్‌కు ఫైజర్ టీకా డోసులు ఎగుమతి చేయాలంటే కొన్ని విషయాలలో తమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. 

50 మిలియన్ల వాక్సిన్ డోసులు
తమతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లయితే 50 మిలియన్ల ఫైజర్ వ్యాక్సిన్ (Pfizer Vaccine) డోసులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తమకు కొన్ని విషయాలలో మినహాయంపు కల్పిస్తే 2021 చివరికల్లా ఈ వ్యాక్సిన్ డోసులను భారత్‌కు ఎగుమతి చేయడానికి ఫైజర్ సంస్థ సిద్ధంగా ఉంది. మరోవైపు అమెరికాకు చెందిన మరో ఫార్మా సంస్థ మోడెర్నా తమ కోవిడ్19 వ్యాక్సిన్లను భారత్ కేంద్రంగా ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ముంబైకి కేంద్రంగా ఉన్న సిప్లా కంపెనీ, ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా భారత్‌లోనే తమ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Also Read: Health Tips: మామిడి పండు తిన్నాక ఈ పదార్థాలు తినకూడదు, నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు

కాగా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమెరికా ఫార్మా కంపెనీలకు వ్యాక్సిన్ సరఫరా కోసం సంప్రదించగా.. నేరుగా రాష్ట్రాలకు తమ కోవిడ్19 వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు నిరాకరించడం తెలిసిందే. కేవలం కేంద్ర ప్రభుత్వ సహకారం, పరస్పర ఒప్పందాలతో మాత్రమే తమ కరోనా వ్యాక్సిన్లను భారత్‌కు తీసుకొస్తామని స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల వెల్లడించారు. కేంద్రం చొరవతో విదేశాల నుంచి వ్యాక్సిన్లు భారత ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్రాలకు ఆ అవకాశం లేదన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News