హాఫీజ్ సయీద్ ఆస్తులు పాక్ చేతిలోకి?

జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఆస్తులపై నిఘా పెట్టింది పాక్ ప్రభుత్వం. ఆయన ఆస్తులని జప్తుచేయాలని భావిస్తోంది.

Last Updated : Jan 1, 2018, 06:33 PM IST
హాఫీజ్ సయీద్ ఆస్తులు పాక్ చేతిలోకి?

జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఆస్తులపై నిఘా పెట్టింది పాక్ ప్రభుత్వం. ఆయన ఆస్తులని జప్తుచేయాలని భావిస్తోంది. హాఫీజ్ ఛారిటీలపైన, ఆర్థిక లావాదేవీలపైన నియంత్రణ విధించాలని యోచిస్తోంది. అమెరికా కూడా అతన్ని ఉగ్రవాదిగా పేర్కొనడంతో ఆ దిశగా అడుగులు వేస్తోంది పాక్.

ఇప్పటికే పాక్ ప్రభుత్వం రహస్యంగా అన్ని రాష్ట్రాలకు, శాఖలు ఒక సందేశాన్ని పంపింది. డిసెంబర్ 19న పాకిస్థాన్ ఐదు రాష్ట్రాలకు రహస్యంగా సందేశాలను పంపి హఫీజ్ ఆస్తుల టేకోవర్ కు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలపాలని పోలీసులకు హుకుం జారీచేసింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 28న సయీద్ కు చెందిన రెండు ఛారిటీలను జమాత్- ఉద్- దవాన్, ఫలాహ్- ఇ- ఇంసనియత్ ఫౌండేషన్లను సీజ్ చేయాలని ఆదేశించింది. సయీద్ 2008 ముంబై పేలుళ్లకు సంబంధించిన ప్రధాన సూత్రధారి. అమెరికా హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడో సమాచారం అందిస్తే.. 10 మిలియన్ డాలర్లు ఇస్తామని ముంబై పేలుళ్ల ఘటన తరువాత ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే..!

Trending News