Oxford Study on Vaccines: వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం పెరిగితే ప్రయోజనం అధికం

Oxford Study on Vaccines: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో పరిశోధన కీలక విషయాలు వెల్లడించింది. వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం విషయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తాజా అధ్యయనం వెల్లడించిన అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 29, 2021, 07:28 PM IST
Oxford Study on Vaccines: వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం పెరిగితే ప్రయోజనం అధికం

Oxford Study on Vaccines: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో పరిశోధన కీలక విషయాలు వెల్లడించింది. వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం విషయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తాజా అధ్యయనం వెల్లడించిన అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ - ఆస్ట్రాజెనెకా (Oxford-Astrazeneca)సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్(Covishield vaccine) విషయంలో ఇప్పుడు మరికొన్ని కీలక విషయాలు వెలువడ్డాయి.వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామానికి సంబంధించి తాజా అధ్యయనం జరిగింది.ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ చేసిన ఈ అధ్యయనంలో కీలకాంశాలు వెలుగు చూశాయి. రెండవ డోసు, మూడవ డోసు ఆలస్యంగా తీసుకోవడం వల్ల కరోనా నిరోధక శక్తి మరింతగా పెరుగుతుందని తేలింది.తొలి రెండు డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే ఇమ్యూనిటీ ఎక్కువగా పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. ఎక్కువ విరామం ఉంటే ఇమ్యూనిటీ తగ్గుతుందన్న వాదనను ఈ అధ్యయనం తోసిపుచ్చింది.

రెండవ డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత మూడవ డోసు తీసుకుంటే శరీరంలో యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ (Oxford university)తెలిపింది. అయితే ఈ అధ్యయనాన్ని మరింత లోతుగా పరీక్షించాల్సి ఉంది. రెండవ డోసు ఆలస్యం కావడం వల్ల లాభమే ఎక్కువని తేలింది. మొదటి డోసు వేసుకున్న 10 నెలల అనంతరం రెండవ డోసు వేసుకున్నవారిలో ఇమ్యూనిటీ(Immunity)అద్భుతంగా పెరిగినట్టు గమనించారు.ఈ వ్యాక్సిన్‌తో అతికొద్దిమందిలోనే రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడినట్టు గుర్తించారు. 

Also read: Delta Variant: డెల్టా వేరియంట్ చాలా డేంజరస్..ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News