ఫిలిప్పీన్స్ లో తుఫాను.. 182 మంది మృతి

'టెంబిన్' తుఫాను ధాటికి ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతం అతలాకుతం అయింది. ఒక్కసారిగా తుఫాను కారణంగా మెరుపు వరదలు సంభవించి,పెద్ద ఎత్తున మట్టి కొట్టుకురావడంతో ఆ ప్రళయంలో 182 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు

Last Updated : Dec 24, 2017, 04:13 PM IST
 ఫిలిప్పీన్స్ లో తుఫాను.. 182 మంది మృతి

'టెంబిన్' తుఫాను ధాటికి ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతం అతలాకుతం అయింది. ఒక్కసారిగా తుఫాను కారణంగా మెరుపు వరదలు సంభవించి,పెద్ద ఎత్తున మట్టి కొట్టుకురావడంతో ఆ ప్రళయంలో 182 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 153 మంది గల్లంతయ్యారు. అనేక మంది నిరాశ్రయులు అయినట్లు ఫిలిప్పీన్స్ అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది. 'టెంబిన్' తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించినా.. ప్రజలు ఖాతరుచేయలేదని.. అందుకే ప్రాణనష్టం పెరిగిందని అధికారులు చెప్తున్నారు. 

ఏటా 20కు పైగా తుఫానులు ఫిలిప్పీన్స్ పై విరుచుకు పడుతుంటాయి.అవేవీ ఫిలీప్పిన్స్ దీవులకు నష్టం కలిగించవు. ఆ కారణం చేతే ప్రజలు హెచ్చిరికలను పట్టించుకోలేదు. భారీగా కొట్టుకొచ్చిన వరద మట్టి సహాయక చర్యలకు ఆటంకం కలిస్తోంది. మిన్ టనావో దేశంలోనే రెండవ పెద్ద ద్వీపం. తీవ్ర నష్టం ఇక్కడే వాటిల్లింది.

Trending News