WHO Warns about Omicron is very Dangerous to Unvaccinated People: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువే అయినప్పటికీ.. అది ప్రమాదకర వేరియంటేనని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోనివారికి ఒమిక్రాన్‌తో ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని చెబుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి వల్లే కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని... చాలా దేశాల్లో డెల్టా కేసులను ఒమిక్రాన్ భర్తీ చేస్తోందని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికీ వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకోని వారి సంఖ్య 85 శాతం పైబడి ఉందని టెడ్రోస్ పేర్కొన్నారు. 90 దేశాల్లో ఇప్పటివరకూ 40 శాతం వ్యాక్సినేషన్ కూడా జరగలేదన్నారు. 36 దేశాల్లో ఇప్పటివరకూ కేవలం 10 శాతం వ్యాక్సినేషన్ మాత్రమే జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ త్వరగా పూర్తయితే తప్ప కరోనా మహమ్మారి నుంచి బయటపడలేమన్నారు. వ్యాక్సినేషన్ పరంగా వెనుకబడిన దేశాలకు డబ్ల్యూహెచ్ఓ, దాని భాగస్వామ్య దేశాలు అవసరమైన సాయం అందిస్తున్నాయని తెలిపారు.
'ఒమిక్రాన్'ను లైట్ తీసుకోవద్దు..
'ఒమిక్రాన్ సాధారణ జలుబు లాంటిది కాదు. దాన్ని లైట్ తీసుకోవద్దు. ఒమిక్రాన్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలి. వ్యాక్సినేషన్ తప్పనిసరి...' అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకె పాల్ పేర్కొన్నారు. గురువారం (జనవరి 13) నాటికి భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5488కి చేరింది. ఇప్పటివరకూ 2162 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో... జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కొత్త కేసుల్లో ఒమిక్రాన్ కేసులను నిర్ధారించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటివరకూ అత్యధికంగా మహారాష్ట్రలో 1367 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో 792 ఒమిక్రాన్ కేసులతో రాజస్తాన్, 549 కేసులతో ఢిల్లీ ఉన్నాయి.
దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా కేసులు :
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య (Omicron Cases in India) అకస్మాత్తుగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతానికి పైనే ఉంది. ఉత్తరప్రదేశ్‌లో కేసుల సంఖ్య 14 రెట్లు పెరిగింది. బీహార్‌లో 11.27 రెట్లు, మధ్యప్రదేశ్‌లో 10.95 రెట్లు పెరిగింది. దాదాపు 19 రాష్ట్రాల్లో 10వేల పైచిలుకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం (జనవరి 13) ఒక్కరోజే దేశంలో 2,47,417 కేసులు నమోదవడం తీవ్ర కలకలం రేపుతోంది. కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా భేటీ కానున్నారు. వైరస్ కట్టడి చర్యలపై సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు.
Also Read: Rat Magawa Dies: రిటైర్మంట్ తీసుకున్న 'హీరో' మూషికం మృతి.. ఘనంగా అంత్యక్రియలు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook