China Omicron Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ (Omicron Variant).. ఇప్పడు వరల్డ్ వైడ్ గా మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ లతో అతలాకుతలమైన దేశాలు..ఇప్పుడు ఒమిక్రాన్ దాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు (Omicron in China) నమోదవుతున్నా.. తమ దేశంలో కేసులు పెద్దగా లేవని చైనా బుకాయిస్తూ వస్తోంది. అక్కడి మీడియా సైతం డ్రాగన్ కంట్రీకు వంత పాడుతోంది. అందుకే అక్కడ వాస్తవ పరిస్థితులు పెద్దగా బహిర్గతం కావట్లేదు.
ఇదిలా ఉంటే.. జర్మన్ కార్ల కంపెనీ వొక్స్ వ్యాగన్ (Volkswagen) చైనాలోని టియాన్‌జిన్ (Tianjin) నగరంలో మ్యాన్‌ఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచే కార్లను తయారు చేస్తున్నది. అదే నగరంలో కార్ల విడిభాగాల తయారీ కంపెనీనీ కూడా ఏర్పాటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా రెండు యూనిట్లలోనూ ఒమిక్రాన్ కేసులు బయటపడినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో ఆ రెండు యూనిట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Also Read: China quarantine in metal boxes : చైనాలో కోవిడ్ బారినపడ్డ వారిని ఆ బాక్స్‌లలో పెట్టేస్తున్నారు..
నగరంలో పరిస్థితి ఆశాజనకంగా లేదని, ఒమిక్రాన్ తాకిడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. చైనాలోని వాస్తవ పరిస్థితులకు ఇది అద్దం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఒక్క టియాన్‌జింగ్ నగరంలోనే కాకుండా అనేక నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. వచ్చే నెలలో బీజింగ్‌లో జరగబోయే వింటర్ ఒలింపిక్స్(Winter Olympics 2022) అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook