First Omicron Case in North Korea: ఉత్తరకొరియాలో తొలి ఒమిక్రాన్ కేసు.. దేశంలో లాక్‌డౌన్

First Omicron Case in North Korea: తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో ఉత్తరకొరియా ఉలిక్కిపడింది. ఆఘమేఘాల మీద అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్..దేశం మొత్తం లాక్‌డౌన్ విధించాడు. రెండేళ్ల పాటు దేశాన్ని సురక్షితం ఉంచామనీ.. ఇప్పుడు అతిపెద్ద అత్యవసర పరిస్థితి వచ్చిందంటూ అధికారులు ప్రకటన చేశారు. కొవిడ్ మహమ్మారి విజృంభించాకా..తమ దేశంలో కరోనా కేసు నమోదైందని కిమ్ ప్రభుత్వ ప్రకటించడం ఇదే తొలిసారి.

Written by - Attili | Edited by - Attili | Last Updated : May 29, 2022, 06:39 PM IST
  • ఉత్తరకొరియాలో తొలి ఒమిక్రాన్ కేసు
  • దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన కిమ్
  • అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధికారులు
First Omicron Case in North Korea: ఉత్తరకొరియాలో తొలి ఒమిక్రాన్ కేసు.. దేశంలో లాక్‌డౌన్

First Omicron Case in North Korea: తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో ఉత్తరకొరియా ఉలిక్కిపడింది. ఆఘమేఘాల మీద అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్..దేశం మొత్తం లాక్‌డౌన్ విధించాడు. రెండేళ్ల పాటు దేశాన్ని సురక్షితం ఉంచామనీ.. ఇప్పుడు అతిపెద్ద అత్యవసర పరిస్థితి వచ్చిందంటూ అధికారులు ప్రకటన చేశారు. కొవిడ్ మహమ్మారి విజృంభించాకా..తమ దేశంలో కరోనా కేసు నమోదైందని కిమ్ ప్రభుత్వ ప్రకటించడం ఇదే తొలిసారి.

రెండేళ్లుగా తమ దేశంలో కరోనా అసలు లేదనట్లుగా ఉత్తరకొరియా ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తోంది. అదే సమయంలో సరిహద్దు మూసేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అయితే దక్షిణ కొరియా, అమెరికాలు మాత్రం ఉత్తరకొరియా అవాస్తవాలు చెబుతోందనీ.. అక్కడ కరోనా తీవ్రంగా ఉందంటూ వాదిస్తూ వస్తున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఇలా ఒమిక్రాన్ కేసు నమోదైందన్న విషయాన్ని ఉత్తర కొరియా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. ఉత్తరకొరియాలో ఒమిక్రాన్ బీఏ.2 రకాన్ని గుర్తించారు. పొలిట్ బ్యూరో  అత్యవసర భేటీని నిర్వహించిన కిమ్ జాంగ్ ఉన్న...కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దేశం మొత్తం సంపూర్ణ లాక్‌డౌన్ విధించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించారు. అయితే ఎన్ని ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయన్న విషయాన్ని సదరు న్యూస్ ఏజెన్సీ ప్రస్తావించలేదు.

2 కోట్ల 50 వేల జనాభా ఉన్న ఉత్తరకొరియా అరకొర వైద్య సదుపాయాలతో కొట్టుమిట్టాడుతోంది. అక్కడ ప్రజలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగలేదని తెలుస్తోంది. తాము టీకాలు పంపుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా, రష్యా దేశాలు ముందుకొచ్చినా..ఉత్తరకొరియా వాటిని తీసుకొనేందుకు అంగీకరించలేదు.

అయితే కరోనా విజృంభించిన తొలి రోజుల్లో వైరస్ సోకిన వారి పట్ల కిమ్‌ జాంగ్ ఉన్న అత్యంత కిరాతకంగా వ్యవహరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా బాధితులను కాల్చ చంపించారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ ఆరోపణలను కిమ్ సర్కార్ తోసిపుచ్చింది. తమ దేశంలోకి అసలు కరోనా ప్రవేశించలేదని ప్రకటించింది. రెండేళ్లుగా అక్కడ కొవిడ్ పరిస్థితి ఏంటన్నది బాహ్య ప్రపంచానికి తెలీదు.

తాజాగా దేశంలో ఒమిక్రాన్.. కేసు నమోదైనట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. ఉత్తరకొరియాలో పరిస్థితి చేయి దాటిపోతుండటం వల్లే ఇప్పుడు తొలికేసు నమోదైనట్లు ప్రకటించి ఉంటారని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Driving licence new rules: డ్రైవింగ్ లైసెన్స్‌ తీసుకోవాలా ? కొత్త రూల్స్ తెలుసా ?

Also Read: Sherpa Scaled Everest 26 Times: ఎవరెస్ట్‌పైకి 26వ సారి.. రికార్డు బ్రేక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News