Plane crash: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సాంటో డొమినిగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నగరంలో ఉన్న లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రైవేటు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా (Private Jet Crashes in Dominican Republic) కుప్పకూలింది.
ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రైవేటు జెట్ నిర్వహణ సంస్థ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ (Helidosa Aviation Group
) అధికారికంగా ధృవీకరించింది. డొమినికన్ రిపబ్లిక్ కాలమానం ప్రకారం.. బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాద సమయంలో విమానంలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలిపింది హెలిడోసా ఏవియేషన్. ప్రయాణికుల్లో ఆరు మంది విదేశీయులు కాగా.. ఒకరు డొమినికన్ దేశానికి చెందినవారని పేర్కొంది. అయితే మృతుల వివరాలు.. ఏ దేశానికి చెందినవారు అనే విషయాలు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే..
ప్రమాదానికి గురైన ఎయిర్‌క్రాఫ్ట్.. లా ఇసాబెలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సి ఉందని తెలిపారు స్థానిక అధికారులు. అయితే సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని అత్యవసర ల్యాండిగ్ చేస్తుండగా.. విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు.
ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొంది.
Also read: World Omicron Alert: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్
Also read: Dubai: ప్రపంచంలో తొలి కాగిత రహిత ప్రభుత్వంగా దుబాయ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook