/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ( NASA ) చేసిన ప్రకటన ఇప్పుడు మానవాళిని ఆందోళనకు గురిచేస్తోంది. దీపావళి నాడు నాసా చేసిన ప్రకటనతో..భూమికి ముప్పు తప్పదా అనే ప్రశ్నలు రేపుతున్నాయి.

విశ్వంలో( Universe ) మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వేలాది సంవత్సరాల నుంచి తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్  ( Asteroids ) ఢీ కొట్టడం జరుగుతూ వస్తోంది. వివిధ సందర్భాల్లో ఆస్టరాయిడ్లు ఢీ కొట్టడం వల్లనే డైనోసార్లు గానీ భారీ జీవాలు గానీ అంతరించిన పరిస్థితి. ఇప్పుడు రెండు భారీ గ్రహ శకలాలు భూమి వైపుకు అత్యంత వేగంగా దూసుకొస్తున్నట్టు నాసా ప్రకటించడమే కాకుండా హెచ్చరిక జారీ చేసింది. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. 

ఆస్టరాయిడ్ 2020 TB9 ( Asteroid 2020 TB9 ) , ఆస్టరాయిడ్ 2020 ST1 ( Asteroid 2020 ST1 )  అనే రెండు గ్రహ శకలాలు భూమి ( Earth )వైపుకు వస్తున్నట్టు నాసా ( NASA ) తెలిపింది. ఈ రెండు పరిమాణంలో తాజ్ మహల్ ( Tajmahal ) కు రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఆస్టరాయిడ్ 2020 ST1 పరిమాణం 175 మీటర్లు ఉంటుందని..గంటకు 28 వేల 646 కిలోమీటర్ల వేగంతో  దూసుకొస్తోందని నాసా వెల్లడించింది. మరోవైపు ఆస్టరాయిడ్ 2020 TB9 30 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుందని..ఎయిర్ క్రాఫ్ట్ సైజులో ఉంటుందని పేర్కొంది. ఈ గ్రహ శకలం గంటకు 21 వేల 6 వందల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నట్టు నాసా ప్రకటించింది. 

ప్రస్తుతం ఇవి భూమికి 7 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు..ఈ రెండింటితో పాటు మరో రెండు గ్రహ శకలాలు కూడా భూమికి సమీపంలో రానున్నట్టు నాసా వెల్లడించింది. ఈ రెండు గ్రహ శకలాలు నవంబర్ 13-15 మధ్య తేదీల్లో భూమికి సమీపంలో రానున్నట్టు తెలిపింది. 

సాధారణంగా 46.5 మిలియన్ల కంటే ఎక్కువ దూరం నుంచి ఏదైనా గ్రహశకలం అతివేగంతో భూమివైపుకు ( Asteroids nearing to earth ) దూసుకొస్తుంటే..ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువే ఉంటాయని నాసా చెబుతోంది. అయితే నాసా ఇలాంటి గ్రహశకలాల్ని ఇప్పటివరకూ 22 గుర్తించినా..ఎప్పుడూ నష్టం వాటిల్లలేదు. అయితే ఈ గ్రహశకలాల వేగం, పరిమాణం దృష్ట్యా ఒకవేళ భూమిని తాకితే..పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆందోళన కల్గిస్తోంది. Also read: Medicine for Coronavirus: ఫ్లోరియా యూనివర్శిటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ

Section: 
English Title: 
Nasa Warns on Asteroid hit to Earth
News Source: 
Home Title: 

NASA Warning: భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్స్..ముప్పు తప్పదా

NASA Warning: భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్స్..ముప్పు తప్పదా
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

భూమివైపుకు అతివేగంతో దూసుకొస్తున్న రెండు భారీ గ్రహ శకలాలు

ఆస్టరాయిడ్ 2020 TB9 , ఆస్టరాయిడ్ 2020 ST1 లుగా గుర్తించిన నాసా

అతివేగంతో వస్తుంటే ముప్పు ఉండే అవకాశాలు 

Mobile Title: 
NASA Warning: భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్స్..ముప్పు తప్పదా
Publish Later: 
No
Publish At: 
Saturday, November 14, 2020 - 23:22
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman