ప్రపంచ పర్యావరణ పరిరక్షకుడిగా మోడీ ; ఐరాసా అత్యున్నత పురస్కారానికి ఎంపిక

                                          

Last Updated : Sep 27, 2018, 11:51 AM IST
ప్రపంచ పర్యావరణ పరిరక్షకుడిగా మోడీ ; ఐరాసా అత్యున్నత పురస్కారానికి ఎంపిక

భారత ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌవరం లభించింది.  ఐక్యరాజ్యసమతీ అత్యున్నత పురస్కారం "ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్" అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని జనహితంగా మార్చేందుకు కృషి చేస్తున్న ఆరుగురిని ఎంపిక చేయగా.. వారిలో మన దేశ ప్రధాని మోదీ పేరు కూడా ఉండటం గమనార్హం. పర్యావరణ విభాగంలోని పాలసీ లిడర్ షిప్ కేటగిరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి ప్రధాని మోడీ ఈ అవార్డును అందుకోనున్నారు

అంతర్జాతీయ స్థాయిలో సౌర విద్యుత్ భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంలో మోడీ చూపుతున్న నాయకత్వ లక్షణాలు...అలాగే ఇండియాను ప్లాస్టిక్ రహిత దేశంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేసి.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నందుకుగానే భారత ప్రధాని నరేంద్ర మోడీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఐరాస పర్యావరణ విభాగం వెల్లడించింది.

Trending News