Mysterious Epidemic Threat: చైనాలో మరో వింత వ్యాధి భయం, హెచ్చరించిన ప్రోమెడ్ సంస్థ

Mysterious Epidemic Threat: కోవిడ్ 19 నుంచి తేరుకునేలోగా మరో కొత్త వ్యాధి ఆ దేశాన్ని వెంటాడుతోంది. అంతుచిక్కని వింత వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఆందోళన కల్గిస్తోంది. బాధితులంతా పిల్లలే కావడంతో కలకలం రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 23, 2023, 11:01 AM IST
Mysterious Epidemic Threat: చైనాలో మరో వింత వ్యాధి భయం, హెచ్చరించిన ప్రోమెడ్ సంస్థ

Mysterious Epidemic Threat: కరోనా మహమ్మారి వ్యాధి నుంచి ప్రపంచం ఈ మద్యనే కోలుకుంది. చైనా నుంచి మొదలైన ఈ వ్యాధి మొత్తం ప్రపంచాన్ని రెండున్నరేళ్లు వెంటాడింది. ఇప్పుడు అదే చైనా నుంచి మరో కొత్త వ్యాధి వ్యాపిస్తుండటం ఆందోళనగా మారింది. విద్యాసంస్థలు మూతపడనున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

2019 చివర్లో చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లో చేసుకుని ఎలా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు స్థంబించిపోయింది. కోట్లాదిమంది కరోనా వ్యాధికి గురయ్యారు. లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. ఈ క్రమంలో అదే చైనా నుంచి మరో వింత వ్యాధి బయలుదేరింది. మిస్టీరియస్ నిమోనియాగా పరిగణిస్తున్న ఈ వ్యాధి పూర్తిగా పిల్లల్ని టార్గెట్ చేస్తోంది. ఈ వ్యాధి కారణంగా వేలాది సంఖ్యలో పిల్లలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కలకలం రేగుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలో చైనాలో విద్యాసంస్థల్ని మూసివేసే నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 

చైనాలో ఈ వింత వ్యాధి సంక్రమణ చూస్తుంటే కరోనా ప్రారంభరోజులు గుర్తొస్తున్నాయంటున్నారు చైనా వైద్యులు. బీజింగ్, లియానింగ్‌లోని ఆసుపత్రుల్లో గత రెండ్రోజుల్నించి ఈ కొత్త వ్యాధి బాధిత పిల్లల కేసులు భారీగా పెరిగాయి. ఈ వ్యాధిబారిన పడిన పిల్లల్లో ఊపిరితిత్తుల్లో వాపు, అధిక జ్వరం లక్షణాలు కన్పిస్తున్నాయి. దగ్గు, ఫ్లూ వంటి లక్షణాల్లేవు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యాధుల వ్యాప్తిని ట్రాక్ చేసే ఓపెన్ యాక్సెస్ సర్వైలెన్స్ ప్లాట్‌ఫామ్ ProMed ఈ వింత వ్యాధి గురించి హెచ్చరించింది. కరోనా మహమ్మారికి ముందు కూడా ఇదే సంస్థ హెచ్చరిక జారీ చేసింది. శ్వాసకోశ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదముందని ప్రోమెడ్ సంస్థ హెచ్చరించింది. 

Also read: Srilanka Earthquake: శ్రీలంకలో భారీ భూకంపం, 6.2 తీవ్రతతో కొలంబోలో కంపించిన భూమి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News