Congo Floods: కాంగోలో వరద బీభత్సం.. 200 మందికిపైగా మృతి.. వందలాది మంది గల్లంతు..

Congo Floods: ఆఫ్రికా దేశమైన కాంగోను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దక్షిణ కివు ఫ్రావిన్స్ ను వరద నీరు పోటెత్తడంతో.. రెండు వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 8, 2023, 08:09 AM IST
Congo Floods: కాంగోలో వరద బీభత్సం.. 200 మందికిపైగా మృతి.. వందలాది మంది గల్లంతు..

Congo Floods Update: వరదల ధాటికి డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరద బీభత్సానికి రెండు వందల మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనేక మంది గల్లంతయ్యారు. 

ముఖ్యంగా ఈ వరదలు దక్షిణ కివు ప్రావిన్స్‌ను ముంచెత్తాయి. చాలా ఊళ్లు కొట్టుకుపోయాయి. బుషుషు మరియు న్యాముకుబి గ్రామాల పరిస్థితి మరి దారుణంగా ఉంది. పొలాలన్నీ నీటమునిగాయి. ప్రధాన రహదారులన్నీ నీటమునగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు 203 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. వాటిని చూసి గ్రామస్థులు రోధిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

"వరదలో చిక్కుకున్న వారికి, గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించడానికి సర్జన్లు, మత్తుమందు నిపుణులు మరియు సాంకేతిక నిపుణుల బృందాన్ని ఈ ప్రాంతానికి పంపినట్లు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెనిస్ ముక్వేగే తెలిపారు. అతని క్లినిక్ దక్షిణ కివు రాజధాని బుకావులో ఉంది.  రువాండా సరిహద్దులో ఉన్న దక్షిణ కివు ప్రావిన్స్ లో తరచుగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడతాయి. అక్టోబరు 2014లో కాంగోలో ఇలాంటి ప్రకృతి విపత్తే సంభవించింది. అప్పుడు 700 ఏళ్లు ధ్వంసం కాగా.. 130 మంది గల్లంతయ్యారు. 

Also Read: Gun fires at Dallas: అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ.. 8 మంది మృతి.. ఏడుగురికి గాయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News