Money Plant Vastu: ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకునే వాళ్లు ఈ జాగ్రత్తలు పాటించాలి.. లేదంటే??

Money Plant Vastu: ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే ఈ ప్లాంట్ పెంచే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే అనుకూల ప్రభావానికి బదులు ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 04:12 PM IST
Money Plant Vastu: ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకునే వాళ్లు ఈ జాగ్రత్తలు పాటించాలి.. లేదంటే??

Money Plant Vastu: సాధారణంగా ఇంట్లో డెకరేషన్ కోసం లేదా పచ్చదనాన్ని పెంచేందుకు చాలా మంది చిన్న చిన్న చెట్లను లేదా మొక్కలను నాటుతుంటారు. ఈరోజుల్లో చాలా మంది తమ తమ నివాసాల్లో మనీప్లాంట్ ను పెంచుతున్నారు. అయితే ఈ మొక్క ఏ వాతావరణంలో పెరుగుతుంది? దాని ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఏంటో చాలా మందికి అవగాహన లేదు. 

మనీ ప్లాంట్ పెంచుకునే వాళ్లు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే సంపదల తల్లి లక్ష్మీ దేవీ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దాని వల్ల ఇంట్లో సంతోషం దూరమవ్వడం సహా ఆర్థిక సంక్షోభం మొదలవుతుందని తెలుస్తోంది. అయితే ఈ మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మనీ ప్లాంట్ పెంచుకునే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో తెలుసుకోండి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ ను తూర్పు, పడమర దిక్కులో నాటకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు మరింత పెరుగుతాయి. వినాయకుడు ఆగ్నేయ దిశకు అధిపతిగా భావిస్తారు. ఈ క్రమంలో మనీ ప్లాంట్ ను ఆ దిక్కుగా నాటితే మంచి ఫలితం లభిస్తుందని తెలుస్తోంది. 

మనీ ప్లాంట్ కు చెందిన ఆకులు లేదా కొమ్మలు ఎండిపోతే వాటిని వెంటనే మొక్క నుంచి కత్తిరించాలి. మీ ఇంట్లోని మనీ ప్లాంట్ కు సంబంధించిన ఎండిపోయిన ఆకులు వెరొకరితో తొలగిస్తే మంచిది. ఎందుకంటే ఎవరి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుందో.. వాళ్లు వారి స్వహస్తాలతో మనీ ప్లాంట్ ను తొలగించరాదు. 

మనీ ప్లాంట్ కు ఎల్లప్పుడూ నీటిని ఫిల్టర్ చేసి పోయాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు మాత్రమే నీరు పోయాలి. నీరు పోసే క్రమంలో ఆకులపై కూడా నీరు చల్లాలి. అయితే ఆకులపై ఎక్కువగా నీరు చల్లడం వల్ల అవి ఎండిపోయే అవకాశం ఉంది. చలికాలంలో ఈ మొక్కకు ఎలాంటి ఎరువులు వేయకూడదు. 

మనీ ప్లాంట్ ను పెరట్లో కంటే ఇంట్లో ఉంచుకోవడమే ఎంతో ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఆ మొక్కను ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉంచాలి. ఒకవేళ మనీ ప్లాంట్ ను ఇంటి బయట పెడితే దాని సానుకూల ప్రభావం ఉండదు. మంచికి బదులుగా చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా వాస్తు శాస్త్రం నుంచి గ్రహించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Astro Tips: సూర్య భగవానుడిని ఇలా ప్రసన్నం చేసుకుంటే.. అన్ని రకాల సమస్యల నుంచి గట్టెక్కుతారు..

Also Read: Food lover zodiacs: ఫుడ్​ లవర్స్​లో ఈ రాశుల వారే అధికమట తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News