Google and Microsoft: ఇండియాకు సహాయం అందించనున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు

Google and Microsoft: ఇండియాలో కరోనా వినాశకర పరిస్థితులపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి. సహాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. కోవిడ్ సంక్షోభంలో నలిగిపోతున్న దేశానికి సహాయం అందించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు ముందుకొచ్చారు. వైద్య పరికరాల కొనుగోలుకు ఆర్దిక సహాయం అందించనున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 26, 2021, 12:14 PM IST
  • ఇండియాలో పరిస్థితులపై బాధ కలుగుతోందన్న సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చాయ్
  • ఆక్సిజన్ కాన్‌సెంట్రేటెడ్ పరికరాల కొనుగోలుకు సహాయం అందిస్తామన్న సత్య నాదెళ్ల
  • వైద్య పరికరాల కొనుగోలు కోసం 130 సహాయం అందించిన గూగుల్ సంస్థ
Google and Microsoft: ఇండియాకు సహాయం అందించనున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు

Google and Microsoft: ఇండియాలో కరోనా వినాశకర పరిస్థితులపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి. సహాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. కోవిడ్ సంక్షోభంలో నలిగిపోతున్న దేశానికి సహాయం అందించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు ముందుకొచ్చారు. వైద్య పరికరాల కొనుగోలుకు ఆర్దిక సహాయం అందించనున్నారు.

దేశంలో కరోనా మహమ్మారి (Corona virus)పెద్దఎత్తున విజృంభిస్తోంది. రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో దేశం ఉంది. ఓ వైపు ఆక్సిజన్ కొరత( Oxygen Shortage) మరోవైపు ఆక్సిజన్ సంబంధిత పరికరాల కొరత వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో వివిధ దేశాలు ఇండియాకు సహాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ఇటు భారత సంతతికి చెందిన గూగుల్(Google), మైక్రోసాఫ్ట్( Microsoft) సీఈవోలు సైతం ఇండియాలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. దేశంలోని పరిస్థితులు చాలా బాథ కలిగించాయని సత్య నాదెళ్ల  (Satya Nadella) ట్వీట్ చేశారు. తీవ్ర ఆక్సిజన్ కొరత నేపధ్యంలో దేశానికి సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ పరికరాల ( Oxygen Concentrator devices) కొనుగోలుకు మద్దతు ఇవ్వనున్నట్టు చెప్పారు. 

మరోవైపు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sunder Pichai) కూడా స్పందించారు. ఇండియాలో తీవ్రతరమౌతున్న కోవిడ్ సంక్షోభం చూసి తల్లడిల్లిపోయానన్నారు. గూగుల్ సంస్థ( Google), ఉద్యోగులు కలిపి భారత ప్రభుత్వానికి 135 కోట్ల నిధుల్ని ఇవ్వనున్నామన్నారు. మరోవైపు వైద్య సామగ్రి కోసం యూనిసెఫ్, హై రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు, క్లిష్టమైన సమాచారాన్ని అందిస్తామన్నారు. ఇండియాలో గత 24 గంటల్లో 3.52 లక్షల కేసులు నమోదు కాగా..2 వేల 812 మంది మరణించారు. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు, ఆక్సిజన్, నిత్యావసర మందుల కొరత నేపధ్యంలో బ్రిటన్, అమెరికా, సింగపూర్, సౌదీ అరేబియా దేశాలు సహాయాన్ని అందిస్తున్నాయి. 

Also read: Oxygen to India: ఇండియాలో పెరిగిన కరోనా ఉధృతి, సింగపూర్-సౌదీ అరేబియా నుంచి ఆక్సిజన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News