Mobile phone removed from stomach: కడుపులో మొబైల్ ఫోన్.. సెల్ ఫోన్ మింగిన తర్వాత 6 నెలలకు సర్జరీ

Mobile phone removed from stomach after six months: ఏదేమైనా సినిమాల్లోనే చూసే ఇలాంటి సన్నివేశాలు బయట కూడా నిజంగానే జరుగుతాయని తెలిసినప్పుడు కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది కదూ! ప్రపంచం నలుమూలలా అడపాదడపా ఇలాంటి ఘటనలు (What happens if you swallow mobile phone) చోటుచేసుకుంటున్నట్టు 2014 నాటి ఓ అధ్యయనం చెబుతోంది.

Written by - Pavan | Last Updated : Oct 22, 2021, 12:08 PM IST
Mobile phone removed from stomach: కడుపులో మొబైల్ ఫోన్.. సెల్ ఫోన్ మింగిన తర్వాత 6 నెలలకు సర్జరీ

Mobile phone removed from stomach after six months: భరించలేని కడుపునొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స కోసం హాస్పిటల్‌కి వెళ్లాడు. అతడికి ఎక్స్‌రే పరీక్షలు చేసిన వైద్యులు.. ఎక్స్‌రే ఫిలిం, రిపోర్టు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. పేషెంట్ కడుపులో మొబైల్ ఫోన్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు తమ కళ్లని తామే నమ్మలేకపోయారు. మొబైల్ ఫోన్ కడుపులోకి ఎలా పోయింది, ఎప్పుడు మింగావని డాక్టర్లు అడగ్గా.. పేషెంట్ చెప్పిన సమాధానం విని వారు మరింత షాకయ్యారు. 

ఆరు నెలల క్రితమే ఫోన్ మింగానని, కానీ ఆస్పత్రికి వెళ్లి ఎలా చెప్పాలో అర్థం కాక ఎవరికి చెప్పకుండా ఉండిపోయానని చెప్పాడు. ఫోన్ దానంతట అదే బయటికి వస్తుందని భావించానని, అందుకే ఆస్పత్రికి వెళ్లలేదని డాక్టర్లకు తెలిపాడు. ఇటీవల కాలంలో పొత్తి కడుపులో నొప్పి (abdominal pains) ఎక్కువ అవడంతో భరించలేక ఆస్పత్రికి రావాల్సి వచ్చిందని అన్నాడు.

ఈజిప్టులో జరిగిన ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురయ్యేలా చేసింది. పేషెంట్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన అశ్వన్ యూనివర్శిటీ హాస్పిటల్ డాక్టర్లు.. మొబైల్ ఫోన్ కారణంగా అతడి కడుపులో, పెద్దపేగులో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ (abdominal infections) చేరినట్టు గుర్తించారు. ఫోన్ కారణంగా కొంత, ఫోన్ అడ్డుపడటంతో తిన్న ఆహారపదార్థాలు కుళ్లిపోయి కొంత.. కడుపులో బాగా ఇన్‌ఫెక్షన్ ఏర్పడినట్టు వైద్యలు తెలిపారు. అతడికి వెంటనే అత్యవసర శస్త్ర చికిత్స చేసి మొబైల్ ఫోన్‌తో (Mobile phone in stomach) పాటు లోపల శరీర భాగాలకు సోకిన ఇన్‌ఫెక్షన్‌ని తొలగించారు. 

Also read : pigs kidney : మనిషి శరీరానికి పంది కిడ్నీ, ఆపరేషన్‌ విజయవంతం

మొబైల్ ఫోన్ మింగడం ఏంటి ? జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు, వినలేదు అని అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టే. ఎందుకంటే.. ఇలా మొబైల్ ఫోన్ మింగిన ఘటనలు అరుదే అయినప్పటికీ.. ఇదేం మొదటిసారి కాదు. ఇదే ఏడాది కొసొవోలో ఓ వ్యక్తి నొకియా 3310 ఫోన్‌ని (Nokia 3310 phone) మింగేశాడు. డాక్టర్లు అతడికి అతి కష్టంమీద మేజర్ సర్జరీ చేసి బతికించారు. 

2016లోనూ ఓ 29 ఏళ్ల యువకుడు ఇదే తరహాలో మొబైల్ ఫోన్ మింగి (Swallowing mobile phone) తీవ్ర అస్వస్థతకు గురవగా.. డాక్టర్లు అతడికి సర్జరీ చేసి ప్రాణం పోశారు. ప్రపంచం నలుమూలలా అడపాదడపా ఇలాంటి ఘటనలు (What happens if you swallow mobile phone) చోటుచేసుకుంటున్నట్టు 2014 నాటి ఓ అధ్యయనం చెబుతోంది. ఏదేమైనా సినిమాల్లోనే చూసే ఇలాంటి సన్నివేశాలు బయట కూడా నిజంగానే జరుగుతాయని తెలిసినప్పుడు కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది కదూ!!

Also read : Driverless Bike Video: డ్రైవర్​లెస్​ కారు చూశారు.. మరి డ్రైవర్​లెస్​ బైక్​ చూశారా?

Also read : Snake Hanging On Cable wire:గాల్లో కేబుల్ వైర్లపై 12 అడుగుల భారీ పాము.. తరువాత ఏం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News