Maldives: పార్లమెంట్‌లో ఎంపీల పిడిగుద్దుల వర్షం.. వీళ్లు ఎంపీలా.. వీధిరౌడీలా?

Maldives Parliament: ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ద్వీపకల్ప దేశం మాల్దీవులు భారతదేశం ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా కోలుకోలేనట్టు కనిపిస్తోంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన మాల్దీవులకు భారీగా డిమాండ్‌ పడిపోయింది. ఈ ఫ్రస్ట్రేషన్‌తోనే ఎంపీలు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. నిండు పార్లమెంట్‌లో వీధి రౌడీల్లా ఎంపీలు కొట్టుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 28, 2024, 10:44 PM IST
Maldives: పార్లమెంట్‌లో ఎంపీల పిడిగుద్దుల వర్షం.. వీళ్లు ఎంపీలా.. వీధిరౌడీలా?

Maldives MPs Fight: పిడిగుద్దులు.. ఒకరిపై ఒకరు పడి కొట్టుకోవడం వంటివి రౌడీలు, ఆకతాయిలు లేదా శత్రువులు చేస్తుంటారు. కానీ చట్టసభలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు రౌడీల్లా కొట్టుకున్నారు. ఈ సంఘటన మాల్దీవుల్లో చోటుచేసుకుంది. ఆ దేశ పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ సంఘటన జరిగింది. అధికారంలో ఉన్న ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడి చేసుకోవడంతో పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వెంటనే మార్షల్స్‌, భద్రతా సిబ్బంది వచ్చి వారిని చెదరగొట్టారు. ఈ పరిణామంతో మాల్దీవుల పరువు పోయింది.

వివాదానికి కారణం
మంత్రివర్గంలో మంత్రులకు సంబంధించి ఓ బిల్లును ఆమోదించడానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు ప్రత్యేకంగా ఆదివారం పార్లమెంట్‌ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక సమావేశం కావడంతో సమయం చాలా విలువైనది. సంబంధిత బిల్లుపైనే చర్చించాల్సి ఉంది. ఈ బిల్లు విషయంలో చర్చ జరుగుతుండగా అధికార కూటమి ఎంపీలకు, ప్రతిపక్ష ఎంపీలకు వాగ్వాదం జరిగింది. అధికార కూటమికి చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (పీఎన్‌సీ), ప్రొగ్రెసీవ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌ (పీపీఎం), ప్రతిపక్ష మాల్దీవీయన్‌ డెమెక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) ఎంపీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని ఎంపీలు పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరింది.

పార్లమెంట్‌లో తీసుకొచ్చిన బిల్లును ప్రతిపక్ష పార్టీ ఎంపీలు వ్యతిరేకించారు. ఈ సమయంలో అధికార పీఎన్‌సీ పార్టీ ఎంపీ షహీమ్‌ దాడికి పాల్పడ్డారు. ప్రతిపక్ష ఎండీపీ పార్టీ ఎంపీ అయిన ఇసా కాలు పట్టుకుని నేలపై పడేశారు. తనను పడేయంతో షహీమ్‌పై ఇసా కూర్చుని పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామం పార్లమెంట్‌లో గందరగోళానికి దారి తీసింది. వెంటనే తోటి ఎంపీలు వారిని విడదీశారు. ఇసా దాడిలో షహీమ్‌ తీవ్రంగా గాయపడడంతో వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవ అనంతరం పార్లమెంట్‌లో తీవ్ర చర్చ జరిగింది.
Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News