Maldives Elections 2024: మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది. మొత్తం 93 స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటికే 63 స్థానాల్లో గెలిచి మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. ముయిజ్జు పార్టీ విజయం భారత్‌కు మింగుడుపడని పరిణామంగా ఉంది.
గత కొద్దికాలంగా మాల్దీవులతో ఇండియా సంబంధాలు దెబ్బతిన్నాయి, పర్యాటకం విషయంలో ఇండియాతో నెలకొన్న వివాదానికి తోడు ఆ దేశం తీసుకుంటున్న చైనా అనుకూల నిర్ణయాలు ఇండియాకు ఆగ్రహం తెప్పించాయి. మాల్దీవుల్లోని భారత సైన్యాన్ని వెనక్కి పంపించారు. భారత్ వ్యతిరేక చర్యలతో మాల్దీవుల పార్లమెంట్‌లో ముయిజ్జు వైఖరిని చాలామంది వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి రేగింది. కానీ అనూహ్యంగా మరోసారి ముయిజ్జు పార్టీనే భారీ విజయం కైవసం చేసుకుంది.
మాల్దీవుల పార్లమెంట్‌లో మొత్తం 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ , కొన్ని ఇతర పార్టీలు పోటీ చేశాయి. ఇప్పటి వరకూ 86 స్థానాల ఫలితాలు ప్రకటించగా అందులో 63 స్థానాల్లో ముయిజ్జు పార్టీ విజయం సాధించింది. చైనా అనుకూల నిర్ణయాలకే అక్కడి జనం పట్టం కట్టినట్టు తెలుస్తోంది.
చైనా అనుకూలుడిగా ముద్రపడిన ముయిజ్జు ఇటీవల కొన్ని కీలకమైన కాంట్రాక్టుల్ని కూడా ఆ దేశానికి చెందిన కంపెనీలకు కట్టబెట్టారు. భారత్‌పై వ్యతిరేక ధోరణి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ లభించడంతో ఇక మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
Also read: Virat Kohli No Ball Issue: విరాట్ కోహ్లీ అవుట్ నిర్ణయంపై నెటిజన్ల ఆగ్రహం, ముదురుతున్న నో బాల్ వివాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook