Malaysia: మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష

అక్కడ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. కీలకమైన వ్యక్తుల్ని కూడా వదలదు. అవినీతి కేసులో ఆ దేశ మాజీ ప్రధానికి అక్కడి కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించడం సంచలనంగా మారింది.

Last Updated : Jul 28, 2020, 08:22 PM IST
Malaysia: మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష

అక్కడ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. కీలకమైన వ్యక్తుల్ని కూడా వదలదు. అవినీతి కేసులో ఆ దేశ మాజీ ప్రధానికి అక్కడి కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించడం సంచలనంగా మారింది.

మలేషియా ( Malaysia ) లో లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉంటుంది. అవినీతి ఆరోపణలపై మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ ( Ex pm najib razak ) దోషిగా తేల్చింది అక్కడి న్యాయస్థానం. ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మలేషియా డవలప్ మెంట్ బెర్హాద్ ( వన్ ఎండిబీ ) ఫండ్ కేసులో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై కేసు నడిచింది. 2009 నుంచి 2018 వరకూ నజీబ్ మలేషియా ప్రధానిగా పని చేశారు. అవినీతి బయటపడటంతోనే ఆయన పదవి కోల్పోయారు. మలేషియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా నిర్ధారించడం ఇదే తొలిసారి. ఆయనపై అధికార దుర్వినియోగం, మనీ లాండరింగ్, నమ్మకం ద్రోహం కేసులున్నాయి.

మలేషియా ఎన్ ఆర్ సీ ఇంటర్నేషనల్ సంస్థ ( Malaysia NRC International ) నుంచి 9.8 మిలియన్ తన ఖాతాకు మళ్లించుకున్నారన్న ఆరోపణలున్నాయి. అదే విధంగా 4-5 బిలియన్ డాలర్లను వ్యక్తిగత ఖాతాకు మళ్లించారన్న అభియోగముంది. ఈ అన్ని ఆరోపణలు రుజువు కావడంతో కౌలాలంపూర్ కోర్టు ( Kaula lumpur court ) ఏకకాలంలో మూడు శిక్షలు అమలయ్యేలా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. Also read: Covid19 To Cat: యూకేలో పిల్లికి కోవిడ్-19 నిర్ధారణ

Trending News