New coronavirus symptoms: యూకేలో విజృంభిస్తున్న కరోనా కొత్త వైరస్‌పై ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. బ్రిటన్‌లో ప్రారంభమై ఇప్పటికే పలు దేశాల్లో విస్తరించడంతో కలవరం ఎక్కువవుతోంది. ఇంతకీ కొత్త కరోనా వైరస్ లక్షణాలేంటనేది ఓ సారి పరిశీలిద్దాం..
బ్రిటన్ ( Britain ) లో ప్రారంభమైన కొత్త రకం కరోనా వైరస్ ( New coronavirus ) అన్నిదేశాల్ని కలవరపెడుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిందన్న ఆనందం లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడు కోవిడ్ వైరస్ నుంచి ప్రపంచం తిరిగి గాడిన పడుతుందనుకునే క్రమంలో వైరస్ కొత్తరూపు దాల్చి రావడం ఆందోళన కల్గిస్తోంది. కరోనా తొలి రూపు చూసిన ప్రజలు..రెండోరూపుతో మరెన్ని ప్రాణాలు పోతాయోననే భయంతో బతకుతున్నారు. ఇంతగా భయపెడుతున్న కరోనా కొత్త వైరస్ లక్షణాలేంటనేది ( New coronavirus symptoms ) ఆసక్తి కల్గిస్తోంది. పాత కరోనా వైరస్‌కు ఉండే లక్షణాలకు తోడు..అదనంగా మరి కొన్ని లక్షణాలుంటాయని నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది.
తీవ్రమైన అలసట, ఆకలి మందగించడం, తలనొప్పి, విరేచనాలు, మానసిక గందరగోళం, కండరాల నొప్పులు ప్రధానంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు నైజీరియాలో కొత్త రకం వైరస్ కనుగొన్నారని అంటువ్యాధుల నియంత్రణ విభాగం తెలిపింది.
ఈ వైరస్ బ్రిటన్ ( Britain ), దక్షిణాఫ్రికా ( South Africa ) లో గుర్తించిన వైరస్ జాతి కంటే భిన్నమైందని ఆఫ్రికన్ సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ తెలిపింది. నైజీరియాలో గుర్తించిన జన్యువు ఇప్పటివరకూ పరిమితమైన డేటా ఆధారంగా ఉందని..ఉత్పరివర్తన భాగమేనని చెప్పారు.