ప్రధానిపై దాడి.. మాజీ ప్రధాని కుమారుడికి జీవిత ఖైదు

ప్రధానిపై దాడి.. మాజీ ప్రధాని కుమారుడికి జీవిత ఖైదు

Last Updated : Oct 10, 2018, 09:00 PM IST
ప్రధానిపై దాడి.. మాజీ ప్రధాని కుమారుడికి జీవిత ఖైదు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) తాత్కాలిక ఛైర్ పర్సన్ తారిక్ రెహ్మాన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. 2004లో జరిగిన గ్రనేడ్ దాడి కేసుకు సంబంధించి తారిక్‌కు బంగ్లాదేశ్ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. మరో 19 మందికి ఢాకా కోర్టు మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పిందని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. ఈ గ్రనెట్ దాడి కేసులో ఇద్దరు బంగ్లాదేశ్ మాజీ మంత్రులు- మాజీ హోమ్ మంత్రి బాబర్‌, మాజీ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ సలామ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నేతలకు కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్ పర్సన్ ఖలిదా జియాకు అవినీతి ఆరోపణల కేసులో అయిదేళ్ల శిక్ష ప‌డిన‌ విష‌యం తెలిసిందే.

2004 ఆగస్టు 21న ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను టార్గెట్ చేస్తూ 13 గ్రేనేడ్‌లతో దాడికి పాల్పడ్డారు. అప్పడు షేక్ హసీనా ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ఘటనలో 24 మంది మరణించగా.. సుమారు 500 మంది గాయపడ్డారు. అయితే పేలుడు ధాటికి హసీనా పాక్షికంగా వినికిడిని కోల్పోయారు.  బహిరంగ సభ వచ్చిన షేక్ హసీనా ట్రక్కు దిగుతున్న సమయంలో ఈ గ్రనేట్ దాడి జరిగింది.

 

Trending News